ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రాన్ని నిలిపివేయాలన్న పిటిషనర్లపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అభ్యర్థనపై అత్యవసర విచారణ అవసరం లేదని తేల్చిచెప్పింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.
ఇదీ చూడండి: "వారసత్వ రాజకీయాలే వారి అజెండా"
" ఏ బయోపిక్? దానిని మేం చూడలేదు. బహుశా వారాంతంలో మేం చూస్తే, అప్పుడు చెప్పండి. అత్యవసర విచారణ అవసరమని ఎవరు చెప్పారు. సాధారణ క్రమంలోనే విచారణకు వస్తుంది "
- సుప్రీం ధర్మాసనం
మోదీ బయోపిక్ విడుదల వాయిదా వేయాలన్న కాంగ్రెస్ నాయకుడి అభ్యర్థనపై ఈ నెల 8న విచారణ చేపడతామని ఇప్పటికే స్పష్టం చేసింది సుప్రీం కోర్టు.