ETV Bharat / bharat

పౌరులందరికీ 'హెల్త్​ ఐడీ'... ఆ కార్డుతో లాభాలివే...

వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికే నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్​ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. డిజిటల్ రూపంలో ప్రజలందరి వివరాలు ఇందులో అందుబాటులో ఉండనున్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.

PM Modi announces National Digital Health Mission
'డిజిటల్ వైద్యం'- మోదీ ప్రకటించిన హెల్త్ మిషన్ వివరాలివే!
author img

By

Published : Aug 15, 2020, 1:35 PM IST

Updated : Aug 15, 2020, 1:41 PM IST

74వ స్వాంతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఎర్రకోట వేదికగా ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు. నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్‌(ఎన్‌డీహెచ్‌ఎం)ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. పూర్తిగా టెక్నాలజీ ఆధారితమైన ఈ మిషన్‌ వైద్యరంగంలో కీలక మార్పులకు దోహదం చేస్తుందని తెలిపారు.

ఏంటీ నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్?

  • టెక్నాలజీ ఆధారంగా దేశ ప్రజలందరికీ వైద్య సేవలు అందించే కార్యక్రమం.
  • దీని కింద ప్రతి భారతీయుడికి హెల్త్​ ఐడీ కేటాయిస్తారు.
  • హెల్త్ ఐడీ ఆధారంగా ప్రతి పౌరుడి ఆరోగ్య సమాచారం డిజిటల్ రూపంలో భద్రపరుస్తారు.

హెల్త్ ఐడీ అంటే?

  • ప్రతి ఒక్కరికీ ఆధార్​ తరహాలో ఇచ్చే విశిష్ట సంఖ్యే హెల్త్​ ఐడీ.
  • ఈ నెంబర్ ద్వారా వారి ఆరోగ్య రికార్డులు నమోదు చేస్తారు.
  • వైద్యుడు లేదా ఫార్మసీకి వెళ్లిన ప్రతిసారి జాతీయ స్థాయిలో ఆ సమాచారం మొత్తం కార్డులో నిక్షిప్తమవుతుంది.
  • ఏ ఆస్పత్రికి వెళ్లినా ఐడీ ఆధారంగా ఆరోగ్య సమాచారాన్ని అక్కడి వైద్యులు పరిశీలించేందుకు వీలు కలుగుతుంది.

ఏ సమాచారం నిక్షిప్తమవుతుంది?

  • మనం చేయించుకున్న వైద్య పరీక్షల వివరాలు.
  • ఇదివరకు వైద్యులు సూచించిన మందులు.
  • గతంలో ఏం చికిత్స తీసుకున్నారనే విషయాలు.
  • ఆ వ్యక్తికి వర్తించే ప్రభుత్వ ఆరోగ్య పథకాలు, బీమా వివరాలూ ఉండే అవకాశం.

ఉపయోగాలు ఏంటి?

  • దేశంలో ఆరోగ్య సేవల సామర్థ్యం, పనితీరు, పారదర్శకతను గణనీయంగా మెరుగుపరుస్తుంది.
  • మారుమూల ప్రాంతాలకు కూడా టెలీ మెడిసిన్‌, ఈ- ఫార్మసీలు సేవలు అందుతాయి.
  • ఇతర ఆరోగ్య సంబంధ ప్రయోజనాలు పొందడానికి వీలు కలుగుతుంది.

డిజిటల్ హెల్త్ మిషన్​ అమలు ఎలా?

ఈ కార్యక్రమం ఆయుష్మాన్ భారత్ ప్రధాన్‌ మంత్రి జన్‌ ఆరోగ్య యోజన (ఏబీ పీఎం-జేఏవై) పరిధిలోకి వస్తుంది. ఆ పథకం విధివిధానాలకు అనుగుణంగానే ఎన్​డీహెచ్​ఎం అమలవుతుంది.

మన సమాచారానికి భద్రత ఉంటుందా?

  • వ్యక్తిగత గోప్యత, సమాచార భద్రతకు పూర్తి రక్షణ కల్పిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
  • సమాచారం దుర్వినియోగం కాకుండా చూసేందుకు సంబంధిత వ్యక్తుల ఆరోగ్య వివరాలను వైద్యులు, హెల్త్‌ ప్రొవైడర్లు ఒకసారి మాత్రమే పొందే అవకాశం ఉంది.

ఈ కార్యక్రమం నమూనా గతేడాది రూపొందించారు. విస్తృతమైన సమాచారం, మౌలిక సదుపాయాలు ఉపయోగించి సమర్థమైన, అందుబాటు ధరల్లో ఉండే వైద్యాన్ని అందించడమే దీని ప్రధాన ఉద్దేశం. ఈ ఓపెన్ డిజిటల్ వ్యవస్థ ద్వారా అందరికీ అత్యున్నత ప్రమాణాలు కలిగిన వైద్యాన్ని అందించడం సాధ్యమవుతుంది. ప్రస్తుతం ఉన్న డిజిటల్ ఆరోగ్య సేవలు అన్నింటినీ ఎన్​డీహెచ్​ఎం అనుసంధానం చేస్తుంది.

Last Updated : Aug 15, 2020, 1:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.