ETV Bharat / bharat

మోదీ ప్రసంగంలోని ప్రధాన అంశాలివే!

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్​డౌన్​ విధిస్తున్నట్లు ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. జాతినుద్దేశించి ప్రసంగించిన సందర్భంగా పలు కీలక విషయాలు వెల్లడించారు.

PM Modi
మోదీ ప్రసంగంలోని ప్రధాన అంశాలివే!
author img

By

Published : Mar 25, 2020, 5:08 AM IST

దేశంలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్​డౌన్​ విధిస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలు ఇళ్లకే పరిమితమై కరోనా మహమ్మారిని తరిమికొట్టాలన్నారు.

దేశంలో కేసులు 500 దాటిన నేపథ్యంలో జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ.. పలు కీలక విషయాలు వెల్లడించారు.

  1. నేటి నుంచి ఏప్రిల్​ 14 వరకు 21 రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్​డౌన్​. ప్రతి నగరం, పట్టణం, ఊరు, వీధి లాక్​డౌన్​లోకి వెళ్లనుంది. లాక్​డౌన్​ నిర్ణయం ప్రతి ఇంటికి లక్ష్మణ రేఖ వంటిది.
  2. ప్రజల ప్రాణాలు కాపాడటమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కర్తవ్యం. ప్రజల ప్రాణాల కంటే ఏది ఎక్కువ కాదు. 21 రోజుల పాటు జాగ్రత్తగా ఉండి దేశాన్ని కాపాడాలి.
  3. నిత్యావసరాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సరఫరాకు ఏర్పాట్లు.
  4. ఆరోగ్య సేవలకే తొలి ప్రాధాన్యం. వైద్య సదుపాయాల మెరుగు కోసం రూ. 15 వేల కోట్లు కేటాయింపు
  5. పుకార్లు, వదంతులు నమ్మవద్దు. వైద్యుల సిఫారసు లేకుండా ఎలాంటి మందులు వాడకూడదు.
  6. ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించాలి. ఒకరికొకరు దూరంగా ఉంటూ ఇళ్లలోనే ఉండాలి.
  7. బయట ఏం జరిగినా ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలి.
  8. మార్చి 22న నిర్వహించిన జనతా కర్ఫ్యూను విజయవంతం చేసిన మాదిరిగానే లాక్​డౌన్​ పాటించాలి. ఈ విధంగా ఉంటే తప్ప ఈ గండం నుంచి గట్టెక్కే పరిస్థితి లేదు.
  9. అమెరికా, ఇటలీలో అత్యుత్తమ వైద్య సేవలున్నా కరోనా నియంత్రణలో విఫలమయ్యాయి. కరోనా మొదటి లక్ష మందికి చేరడానికి 67 రోజులు పడితే.. కేవలం 11 రోజుల్లోనే ఆ సంఖ్య 2 లక్షలకు చేరింది. ఆ తర్వాత మరో 4 రోజుల్లోనే 3 లక్షలకు చేరింది.
  10. వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది, పోలీసులు, మీడియా ప్రతినిధులు 24 గంటలు పనిచేస్తున్నారు.. వారి క్షేమం కోసం ప్రార్థిద్దాం.

ఇదీ చూడండి: భారత్​ లాక్​డౌన్​: 21 రోజులు అందుబాటులో ఉండేవి ఇవే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.