స్వాతంత్ర సమర యోధుడు భగత్ సింగ్ జయంతిని పురస్కరించుకొని.. ఘన నివాళులు అర్పించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆయన ధైర్యసాహసాలు ఎన్నో ఏళ్లుగా దేశ ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయని ట్విట్టర్ వేదికగా కొనియాడారు మోదీ.
-
मां भारती के वीर सपूत अमर शहीद भगत सिंह की जयंती पर उन्हें कोटि-कोटि नमन। वीरता और पराक्रम की उनकी गाथा देशवासियों को युगों-युगों तक प्रेरित करती रहेगी। pic.twitter.com/LMy2Mlpkol
— Narendra Modi (@narendramodi) September 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">मां भारती के वीर सपूत अमर शहीद भगत सिंह की जयंती पर उन्हें कोटि-कोटि नमन। वीरता और पराक्रम की उनकी गाथा देशवासियों को युगों-युगों तक प्रेरित करती रहेगी। pic.twitter.com/LMy2Mlpkol
— Narendra Modi (@narendramodi) September 28, 2020मां भारती के वीर सपूत अमर शहीद भगत सिंह की जयंती पर उन्हें कोटि-कोटि नमन। वीरता और पराक्रम की उनकी गाथा देशवासियों को युगों-युगों तक प्रेरित करती रहेगी। pic.twitter.com/LMy2Mlpkol
— Narendra Modi (@narendramodi) September 28, 2020
'భరతమాత ముద్దుబిడ్డ భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు. ఆయన ధైర్యం, శౌర్యం యుగాలుగా దేశానికి ప్రేరణగా నిలుస్తాయి.'
- నరేంద్ర మోదీ ట్వీట్
అమిత్ షా కూడా..
భగత్‌సింగ్ 113వ జయంతి సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఆయనకు ఘన నివాళులర్పించారు. భగత్ సింగ్ ఎల్లప్పుడూ భారతీయులకు స్ఫూర్తిగా నిలుస్తారని ట్వీట్ చేశారు షా.
"విప్లవాత్మక ఆలోచనలు, గొప్ప త్యాగనిరతితో స్వాతంత్య్ర సంగ్రామానికి దిశా నిర్దేశం చేసి.. దేశ యువతలో స్ఫూర్తి రగిలించిన షాహీద్ భగత్ సింగ్ ఎల్లవేళలా మనందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటారు."
- అమిత్ షా ట్వీట్
భగత్ సింగ్ గురించి..
భగత్ సింగ్ 1907 సెప్టెంబర్ 28న పంజాబ్(పాక్)లో జన్మించారు. పిన్న వయసులోనే బ్రిటీష్ పాలనను ధిక్కరించారు. దేశంలో స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించి గొప్ప యోధుడిగా నిలిచిన భగత్ సింగ్‌ను.. 23ఏళ్ల వయసులో 1931 మార్చి 23న పంజాబ్‌లోని లాహోర్‌లో ఉరితీశారు.
ఇదీ చదవండి: అభ్యుదయ కవితా యుగంలో ఆయన ఓ ధ్రువతార