భారత్-చైనా వివాదానికి సంబంధించి ప్రధాని నరేంద్రమోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. భారత భూభాగాన్ని చైనాకు అప్పగించారని ఆరోపించారు.
శుక్రవారం జరిగిన అఖిలపక్ష భేటీలో సరిహద్దు ఉద్రిక్తతలకు సంబంధించి ప్రధాని వివరణ ఇచ్చారు. భారత భూభాగంలో ఎవరూ చొరబడలేదని మోదీ ప్రకటించారు. ఈ వ్యాఖ్యలను ఉద్దేశించి రాహుల్ ఈ విధంగా స్పందించారు.
-
PM has surrendered Indian territory to Chinese aggression.
— Rahul Gandhi (@RahulGandhi) June 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
If the land was Chinese:
1. Why were our soldiers killed?
2. Where were they killed? pic.twitter.com/vZFVqtu3fD
">PM has surrendered Indian territory to Chinese aggression.
— Rahul Gandhi (@RahulGandhi) June 20, 2020
If the land was Chinese:
1. Why were our soldiers killed?
2. Where were they killed? pic.twitter.com/vZFVqtu3fDPM has surrendered Indian territory to Chinese aggression.
— Rahul Gandhi (@RahulGandhi) June 20, 2020
If the land was Chinese:
1. Why were our soldiers killed?
2. Where were they killed? pic.twitter.com/vZFVqtu3fD
"చైనా దురాక్రమణకు భారత భూభాగాన్ని ప్రధాని మోదీ అప్పగించారు.
ఒకవేళ అది చైనా భూభాగమైతే.. మరి భారత సైనికులు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? వాళ్లు అక్కడ ఎలా చనిపోయారు?"
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
ప్రభుత్వంలోని సీనియర్ మంత్రులు ప్రధానిని కాపాడేందుకు అబద్ధాలు ఆడుతున్నారని రాహుల్ ఆరోపించారు. భారత జవాన్లు సరిహద్దుల్లో ప్రాణాలు అర్పిస్తోంటే కేంద్రం నిద్ర పోతోందని ట్విట్టర్ ద్వారా విమర్శించారు.
చైనీయులు దాడి చేసినప్పుడు భారత సైనికుల వద్ద ఆయుధాలు లేవని ఘర్షణలో గాయపడ్డ ఓ జవాను తండ్రి చెబుతున్న వీడియోను రాహుల్ పోస్ట్‌కు జతచేశారు. భారత సైనికుల వద్ద ఆయుధాలు ఎందుకు లేవని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
-
It’s sad to see senior GOI ministers reduced to lying in order to protect the PM.
— Rahul Gandhi (@RahulGandhi) June 19, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Don’t insult our martyrs with your lies.#BJPBetraysOurJawans pic.twitter.com/uwrmj1oxq1
">It’s sad to see senior GOI ministers reduced to lying in order to protect the PM.
— Rahul Gandhi (@RahulGandhi) June 19, 2020
Don’t insult our martyrs with your lies.#BJPBetraysOurJawans pic.twitter.com/uwrmj1oxq1It’s sad to see senior GOI ministers reduced to lying in order to protect the PM.
— Rahul Gandhi (@RahulGandhi) June 19, 2020
Don’t insult our martyrs with your lies.#BJPBetraysOurJawans pic.twitter.com/uwrmj1oxq1
రాజకీయాలు చేయొద్దు..
తన మాటలను ఉపయోగించి ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ విమర్శించటాన్ని ఆ సైనికుడి తండ్రి ఖండించారు. ఈ విషయంలో రాజకీయాలు చేయవద్దని సూచించారు.
-
The Indian Army is a strong army and can defeat China. Rahul Gandhi don’t indulge in politics in this...my son fought in the army and will continue fighting in the army: Father of injured Indian soldier who fought in #GalwanValleyClash (Amateur Video Source) pic.twitter.com/uGOdM2dJkM
— ANI (@ANI) June 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">The Indian Army is a strong army and can defeat China. Rahul Gandhi don’t indulge in politics in this...my son fought in the army and will continue fighting in the army: Father of injured Indian soldier who fought in #GalwanValleyClash (Amateur Video Source) pic.twitter.com/uGOdM2dJkM
— ANI (@ANI) June 20, 2020The Indian Army is a strong army and can defeat China. Rahul Gandhi don’t indulge in politics in this...my son fought in the army and will continue fighting in the army: Father of injured Indian soldier who fought in #GalwanValleyClash (Amateur Video Source) pic.twitter.com/uGOdM2dJkM
— ANI (@ANI) June 20, 2020
"భారత సైన్యం చాలా దృఢమైనది. చైనాను ఓడించే శక్తి ఉంది. ఈ విషయంలో రాహుల్ గాంధీ రాజకీయాలు చేయవద్దు. నా కుమారుడు సైన్యంలో పోరాడుతున్నాడు. పోరాడుతూనే ఉంటాడు."
- సైనికుడి తండ్రి
భారత్-చైనా వివాదానికి సంబంధించి కొన్ని రోజులుగా రాహుల్ గాంధీ కేంద్రం విమర్శలు చేస్తూనే వస్తున్నారు. సైనికుల వద్ద ఆయుధాలు ఎందుకు లేవని పదే పదే ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి విదేశాంగ మంత్రి జైశంకర్ వివరణ ఇచ్చారు. రెండు దేశాల మధ్య ఎలాంటి ఘర్షణ తలెత్తినా ఆయుధాలను ఉపయోగించకూడదని గతంలో చేసుకున్న ఒప్పందాలకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: 'మన భూభాగంలోకి ఎవ్వరూ చొరబడలేదు'