ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి అవగాహన లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో నుంచి ఉపాయాలను దొంగిలించి ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాలని ప్రధానమంత్రితో పాటు ఆర్థిక మంత్రికి ట్విట్టర్ ద్వారా సూచించారు.
ఓ మీడియా సంస్థ ప్రచురించిన నివేదిక ఆధారంగా చేసుకుని మోదీ ప్రభుత్వాన్ని విమర్శించారు రాహుల్ గాంధీ.
"గ్రామీణ భారతం తీవ్ర సంక్షోభంలో ఉంది. ఆర్థిక వ్యవస్థ కుంటుపడింది. ప్రభుత్వానికి దీనిపై అవగాహన లేదు.
ప్రధానితో పాటు ఆర్థిక మంత్రి మా మేనిఫెస్టోలోని సలహాలను దొంగిలించవచ్చు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కావాల్సిన ప్రణాళికలు వివరంగా పొందుపరిచాం."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
ఇదీ చూడండి- పాపాల పాకిస్థాన్‌కు ఎఫ్ఏటీఎఫ్ 'బ్లాక్‌లిస్ట్' ముప్పు!