భాజపా సీనియర్ నేత మంగే రామ్ గర్గ్ (83) మృతి పట్ల సంతాపం ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమత్రి అమిత్ షా. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గత కొద్దికాలంగా ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు భాజపా దిల్లీ మాజీ అధ్యక్షుడు మంగే రామ్. ఉత్తర దిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 7:30 గం.లకు కన్నుమూశారు.
"దిల్లీతో శ్రీ మంగే రామ్ గర్గ్ గారికి ఎంతో అనుబంధం ఉంది. పార్టీ బలపేతానికి ఆయన ఎంతో కృషి చేశారు. ప్రజలకు ఎంతో సేవ చేశారు. "
-ప్రధాని మోదీ ట్వీట్.
మంగే రామ్ మృతికి సంతాపం తెలిపారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.
దిల్లీలోని భాజపా కార్యాలయంలో మంగేరామ్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు బీజేపీ సీనియర్ నేత ఎల్. కే అడ్వాణీ, హోంమంత్రి అమిత్ షా, విదేశీ వ్యవహారాల మాజీ మంత్రి సుష్మా స్వారజ్.
మరణానికి ముందు తన అవయవాలను దధీచి దేహదాన్ సమితికి దానం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు మంగేరామ్.
2003-2008 మధ్యకాలంలో వాజీపుర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా సేవలందించారు మంగేరామ్. భాజపాలో పలు కీలక బాధ్యతలు చేపట్టారు.
ఇదీ చూడండి: షీలాదీక్షిత్ పార్థివ దేహానికి ప్రముఖుల నివాళి