మహారాష్ట్ర నాసిక్‌లో నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని, బాధిత కుటుంబాలకు సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు.
" మహారాష్ట్ర నాసిక్ జిల్లాలో జరిగిన ప్రమాదం దురదృష్టకరం. ఈ విచారకర సమయంలో బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలి."
-ప్రధాని కార్యాలయం ట్వీట్.
26కు చేరిన మృతులు
నాసిక్ జిల్లా మెయిషీఫటాలో ప్రభుత్వ రవాణా సంస్థ బస్సు వేగంగా వచ్చి ఆటోను ఢీకొనగా రెండు వాహనాలు పక్కన ఉన్న బావిలో పడిపోయాయి. ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య 26కు చేరింది. క్షతగాత్రులకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదంపై దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం.. మృతుల కుటుంబాలకు రూ.పది లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.
ఇదీ చూడండి: నాకు ఇష్టం లేదు.. సీఎం చెప్పారనే చదువుతున్నా: గవర్నర్