ప్రధాని నరేంద్రమోదీ పంద్రాగస్టు ప్రసంగం పూర్తిగా ఆశావహ దృక్పథాన్ని కలిగించేలా కొనసాగింది. కరోనా విజృంభణ తర్వాత దేశంలో నెలకొన్న నైరాశ్య భావనల్ని తరిమికొట్టి, స్ఫూర్తి రగిలించేలా ఆయన అనర్గళంగా మాట్లాడారు. మనల్ని ఎన్ని సమస్యలు ముప్పిరిగొన్నా వాటిని పరిష్కరించే సత్తా ప్రజల్లో ఉందని చెప్పారు. ఎర్రకోట బురుజులపై నుంచి ప్రసంగించడం మోదీకి ఇది ఏడోసారి. స్వావలంబన సాధించడంతో పాటు ప్రపంచం కోసం తయారు చేసేలా మనం ఎదగాలని మోదీ చెప్పారు.
ఎన్నో వనరులు మనవద్ద ఉన్నందువల్ల ఇకపై ముడిసరకు ఎగుమతిదారుగా కాకుండా ఉత్పత్తి ఎగుమతిదారుగా మారుదామని పిలుపునిచ్చారు. కరోనాకు వ్యాక్సిన్ సిద్ధం చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయనీ, అది రాగానే అందరికీ అందేలా చేస్తామని చెప్పారు.
ఇదీ చూడండి టైమ్స్ స్క్వేర్‌లో తొలిసారి ఎగిరిన మువ్వన్నెల జెండా