ETV Bharat / bharat

'రైల్వే మంత్రి గారు... కాల్​ చేయండి ప్లీజ్'

వలస కార్మికులు గురించి మాట్లాడేందుకు రైల్వే మంత్రి పీయూష్​ గోయల్​కు నాలుగు రోజులుగా కాల్​ చేస్తున్నా స్పందన లేదని ఆవేదన వ్యక్తంచేశారు కాంగ్రెస్ లోక్​సభాపక్షనేత అధీర్​ రంజన్ చౌదరి. దయచేసి తనకు తిరిగి కాల్​ చేయాలని గోయల్​కు లేఖ రాశారు.

Please call me back
'రైల్వే మంత్రి గారు ప్లీజ్​ కాల్​ చేయండి'
author img

By

Published : May 1, 2020, 6:03 PM IST

నాలుగు రోజులుగా ఫోన్ చేస్తున్నా రైల్వే మంత్రి నుంచి ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ లోక్​సభాపక్షనేత అధీర్​ రంజన్​ చౌదరి. వలస కార్మికుల అంశంపై మాట్లాడేందుకు తనకు తిరిగి కాల్​ చేయాలని లేఖ ద్వారా వినతి చేశారు. దేశవ్యాప్త లాక్​డౌన్​ విధించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్​ షాతో పరిస్థితులపై చర్చించినట్లు చెప్పారు. వలస కార్మికులు ఒత్తిడికి గురవుతున్న విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు.

"నాలుగు రోజులుగా కొంతసమయం కేటాయించాలని రైల్వే మంత్రికి ఫోన్​ చేస్తున్నాను. కానీ ప్రయోజనం లేకపోయింది. పశ్చిమ్​ బంగా నుంచి వివిధ రాష్ట్రాలకు వలస వెళ్లిన వారి గురించి మీతో అత్యవసరంగా మాట్లాడాలి. దయచేసి నాకు తిరిగి ఫోన్​ చేయాలని వినతి చేస్తున్నా."

-గోయల్​కు లేఖలో అధీర్​ రంజన్ చౌదరి.

ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను సొంత ప్రాంతాలకు తరలించేందుకు ఈరోజు నుంచే ప్రత్యేక రైళ్లను ప్రారంభించింది రైల్వే శాఖ. 1200మందితో తెలంగాణ నుంచి ఝార్ఖండ్​కు రైలు బయలు దేరింది. కార్మికుల కోసం పలు రాష్ట్రాల్లో మరిన్ని రైళ్లు ఏర్పాటు చేయనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.