ETV Bharat / bharat

'దిల్లీలో ఆందోళన' పిటిషన్లపై నేడు సుప్రీంలో విచారణ - violence over the Citizenship Amendment Act

ఈశాన్య దిల్లీలో సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. అయితే.. ఈ ఆందోళనలపై నమోదైన వేర్వేరు పిటిషన్లపై ఇవాళ సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది.

Pleas relating to Delhi violence reach SC & HC, hearing on Wednesday
'దిల్లీలో ఆందోళన' పిటిషన్లపై నేడు సుప్రీంలో విచారణ
author img

By

Published : Feb 26, 2020, 6:13 AM IST

Updated : Mar 2, 2020, 2:39 PM IST

ఈశాన్య దిల్లీలో చెలరేగిన అల్లర్లపై సుప్రీంకోర్టు, దిల్లీ హైకోర్టుల్లో మంగళవారం పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం నేడు విచారణ చేపట్టనుంది.

పౌరసత్వ చట్ట సవరణ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో ఘర్షణలకు సంబంధించిన ఫిర్యాదులపై ఎఫ్​ఐఆర్ నమోదు చేసేలా పోలీసులకు దిశానిర్దేశం చేయాలని కోరుతూ మాజీ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ వజాహత్ హబీబుల్లా, భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ తదితరులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

జస్టిస్ ఎస్.​కె.కౌల్​, జస్టిస్ కె.ఎం.జోసెఫ్​లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్​పై విచారణ చేపట్టనుంది. అలాగే సీఏఏకు వ్యతిరేకంగా షాహీన్​బాగ్​లో​ నిరసన వ్యక్తం చేసిన మహిళలకు రక్షణ కల్పించాలన్న మరో పిటిషన్​ను కూడా సుప్రీం విచారించనుంది. దీనిపై ఇప్పటికే.. కోర్టు నియమించిన మధ్యవర్తులు సీల్డ్​ కవర్లో ఓ నివేదికను దాఖలు చేశారు.

దిల్లీ హైకోర్టులో

ఈశాన్య దిల్లీ అల్లర్లపై మానవహక్కుల కార్యకర్త హక్ష్​ మాండర్, ఫరా నఖ్వీ దాఖలు చేసిన మరో రెండు పిటిషన్లను నేడు దిల్లీ హైకోర్టు విచారించనుంది. హింసకు పాల్పడిన వ్యక్తులపై ఎఫ్​ఐఆర్ నమోదు చేసి, అరెస్టు చేయాలని వీరు న్యాయస్థానాన్ని కోరారు. షాహీన్​బాగ్​తో సహా సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేసిన ఇతర ప్రాంతాల్లోని మహిళలకు కూడా రక్షణ కల్పించాలని వీరు తమ పిటిషన్​లో పేర్కొన్నారు.

ద్వేషపూరిత ప్రసంగాలు!

భాజపా నేతలు అనురాగ్​ ఠాకూర్​, పర్వేష్​ వర్మ, కపిల్ మిశ్రా ద్వేషపూరిత ప్రసంగాలు చేశారని, హింసను ప్రేరేపించారని, వీరిపై చర్య తీసుకోవాలని దిల్లీ హైకోర్టులో పిటిషన్​ దాఖలైంది.

పౌర చట్టం వ్యతిరేక, అనుకూల వర్గాలు ఈ నెల 23న చేపట్టిన ఆందోళనలతో దిల్లీలో ఘర్షణలు ప్రారంభం అయ్యాయి. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకుంటూ, ఇళ్లు, దుకాణాలు, వాహనాలు తగులబెట్టారు. ఈ అల్లర్లలో ఓ హెడ్​ కానిస్టేబులో​ సహా ఇప్పటి వరకు 13 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి: భారత్​-అమెరికా: 'సమగ్ర వాణిజ్య ఒప్పందంతో ముందుకు!'

Last Updated : Mar 2, 2020, 2:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.