బంగాల్‌లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలను స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేలా చూడాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పునీత్ కౌర్ దండా.. ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా పారామిలిటరీ బలగాల్ని దింపాలని కోరారు.
ఎన్నికల సందర్భంగా ప్రతిపక్షపార్టీల నేతలకు రక్షణ కల్పించేలా బంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్ అభ్యర్థించారు. ఇప్పటివరకు బంగాల్‌లో హత్యకు గురైన 300 మంది ప్రతిపక్ష నేతలు,కార్యకర్తల వివరాలు సమర్పించేలా సీబీఐని ఆదేశించాలని సుప్రీంకోర్టును కోరారు పునీత్ కౌర్. 2021లో బంగాల్‌లో శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:370 రద్దును కశ్మీరీలు ఆమోదించినట్లేనా?