కరోనా దృష్ట్యా దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సెంటర్ ఫర్ అకౌంటబిలిటీ అండ్ సిస్టమిక్ ఛేంజ్ సంస్థ. కరోనా నేపథ్యంలో విధించినా లాక్డౌన్ వల్ల ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయని తెలిపింది. ఈ వైరస్ను ఎదుర్కొనేందుకు అధికారులు తీసుకున్న చర్యల వల్ల ప్రస్తుత పరిస్థితి దారుణంగా ఉందని వెల్లడించింది. అందుకే ఆర్టికల్ 360 కింద ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించడం తప్పనిసరి అని పిటిషన్లో పేర్కొంది సీఏఎస్‌సీ.
విద్యుత్, నీరు, గ్యాస్, టెలిఫోన్, ఇంటర్నెట్ బిల్లులు రద్దు చేయాలని వ్యాజ్యంలో కోరింది. వీటితో పాటు ఈఎంఐల చెల్లింపులను వాయిదా వేసేలా అదేశాలివ్వాలని విజ్ఞప్తి చేసింది. ఈ పిటిషన్పై అత్యవసర విచారణ జరపి పరిష్కారం చూపాలని వెల్లడించింది.
ఇదీ చూడండి : గీత గీసి.. సామాజిక దూరం పాటించాలన్న దీదీ