వలస కూలీలకు ఆశ్రయం, భోజన సదుపాయం, ఉచిత రవాణా కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. మహారాష్ట్ర ఔరంగాబాద్‌లో ఇవాళ ఉదయం జరిగిన రైలు ప్రమాదంలో 16 మంది వలస కూలీలు మరణించిన నేపథ్యంలో న్యాయవాది ఆలోక్ శ్రీవాత్సవ పిటిషన్ దాఖలు చేశారు.
"వలస కూలీలు రోడ్లపై తమ స్వస్థలాకు వెళ్లనివ్వద్దని.. వారికి తగిన సదుపాయాలు కల్పించాలని రాష్ట్రాలు, యూటీలను కేంద్రం ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా దేశంలోని వలస కూలీలను గుర్తించి వారికి భోజనం, ఆశ్రయం కల్పించాలని జిల్లా పాలనాధికారులను ఆదేశించాలి. వారు స్వస్థలాకు వెళ్లేందుకు ఉచిత రవాణా ఏర్పాట్లు చేయాలి."
- ఆలోక్ శ్రీవాత్సవ, న్యాయవాది
ఔరంగాబాద్ ప్రమాదాన్ని పిటిషన్లో ప్రస్తావించారు ఆలోక్. వలస కూలీల విషయంలో ఎందుకు దృఢమైన చర్యలు తీసుకోలేదో కేంద్రాన్ని వివరణ కోరాలని కోర్టును అభ్యర్థించారు.
ఇదీ చూడండి: తెల్లారేసరికి 'కూలీ'న బతుకులు- నిద్దట్లోనే అనంతలోకాలకు