ETV Bharat / bharat

కరోనా చికిత్సలో ప్లాస్మా థెరపీ ప్రయోజనం నిల్​!

author img

By

Published : Sep 9, 2020, 11:26 AM IST

కరోనా రోగులకు ప్లాస్మా థెరపీతో ప్రయోజనాలు కనిపించలేదని ఐసీఎంఆర్​ చేసిన సర్వేలో మరోమారు రుజువైంది. తీవ్ర అనారోగ్యానికి గురైన వారికి ప్లాస్మా చికిత్స చేస్తున్నా.. మరణాలు రేటు తగ్గడంగానీ, కోలుకోవడం గానీ పెద్దగాలేదని వెల్లడించింది.

Plasma therapy
కరోనా చికిత్సలో ప్లాస్మా థెరపీ ప్రయోజనం నిల్​!

కొవిడ్​ను జయించిన వారి నుంచి తీసుకున్న ప్లాస్మాతో చేసే చికిత్స వల్ల కరోనా మరణాల రేటు తగ్గడం లేదని మరోసారి రుజువైంది. ఈ మేరకు భారత వైద్య పరిశోధనా సంస్థ(ఐసీఎంఆర్​) నిధులతో చేసిన సర్వేలో తేలింది. ఆరోగ్యం విషమించిన కొవిడ్ రోగులకు ప్లాస్మా థెరపీ చేస్తున్నా.. దానివల్ల మరణాలు రేటు తగ్గడంగానీ, కోలుకోవడంగానీ పెద్దగాలేదని సర్వే వెల్లడించింది.

దేశవ్యాప్తంగా 39 ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో రెండో దశలో పరిశోధన చేయగా ఈ మేరకు తేలినట్లు సర్వే వెల్లడించింది. ఐసీఎంఆర్​ ఏర్పాటు చేసిన జాతీయ కార్యదళం ఈ సర్వేను ఆమోదించింది.

పరిస్థితి విషమంగా ఉన్న కరోనా రోగులకు పరిశోధనా పద్దతిలో ప్లాస్మా థెరపీ చేసేందుకు జూన్ 27న కేంద్ర ఆరోగ్యశాఖ అనుమతి ఇచ్చింది. అయితే.. సామాజిక మాధ్యమాల్లో ప్లాస్మా కోసం అభ్యర్థించడం, బ్లాక్‌ మార్కెట్‌లో అధిక ధరకు ప్లాస్మాను అమ్ముకోవడం వంటి చర్యలను సర్వే ప్రశ్నించింది. ప్లాస్మాను అత్యంత జాగ్రత్తలతో నిర్వహించాల్సి ఉందన్న సర్వే అలాంటి సామర్ధ్యం దేశంలో కొన్ని సంస్థలకు మాత్రమే ఉందని పేర్కొంది. అయినప్పటికీ ప్లాస్మా థెరపీతో పెద్దగా ప్రయోజనాలు కనిపించలేదని వివరించింది.

ఇదీ చూడండి: 'కరోనా రోగులపై పని చేయని ప్లాస్మా చికిత్స'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.