ETV Bharat / bharat

లద్దాఖ్​లో తిప్పలు పడుతున్న చైనా సైన్యం

author img

By

Published : Nov 24, 2020, 8:28 PM IST

తూర్పు లద్దాఖ్​లో చైనా సైన్యం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. అత్యంత శీతల వాతావరణంలో దుస్తుల కొరతతో తిప్పలు పడుతున్నారు చైనా సైనికులు. కఠినమైన పరిస్థితుల మధ్య వీరి నైతిక స్థైర్యం తీవ్రంగా దెబ్బతిందని అధికారులు చెబుతున్నారు. సైనికుల మనో ఉల్లాసం కోసం డ్రాగన్ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.

PLA's morale extremely low, China sets up recreation centres
లద్దాఖ్​లో తిప్పలు పడుతున్న చైనా సైన్యం

తూర్పు లద్దాఖ్​లోని వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న చైనా సైనికుల నైతిక స్థైర్యం అత్యంత తక్కువగా ఉందని నిఘా వర్గాలు తెలిపాయి. దుర్భరమైన పరిస్థితులు, అతి తక్కువ ఉష్ణోగ్రతలు, కఠినమైన వాతావరణ పరిస్థితుల మధ్య చైనా సైనికుల మనోధైర్యం సన్నగిల్లిందని వెల్లడించాయి.

భారత సరిహద్దులో యథాతథ స్థితిని సవాల్ చేస్తూ సైన్యాన్ని ఎల్​ఏసీ వద్ద భారీగా మోహరించింది చైనా. వేలాది మంది సైనికులను వాస్తవాధీన రేఖకు చేర్చింది. ఇక్కడి ఉష్ణోగ్రతలు మైనస్ 30 డిగ్రీల సెల్సియస్​కు పడిపోవడం వల్ల డ్రాగన్ సేనలు తీవ్ర అవస్థలు పడుతున్నారని అధికారులు తెలిపారు. ఇది చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ)కి ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. వారి నైతిక స్థితి అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయిందని వివరించారు.

వినోద సౌకర్యాలు

ఈ పరిస్థితుల్లో వీరికి ధైర్యం కల్పించేందుకు వినోద కేంద్రాలను చైనా ఏర్పాటు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఫిట్​నెస్ సెంటర్లు, వేడినీటి ఈత కొలనులు, హాట్​ టబ్​లు, గ్రంథాలయాలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పాయి. వినోద కేంద్రాలలో కంప్యూటర్లు, ప్లే స్టేషన్లను సైతం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించాయి. భారత్​లోని చుషుల్​కు సమీపంలో ఉండే మోల్డోని సైనిక శిబిరంలో ఇలాంటి ఓ వినోద కేంద్రం నెలకొల్పినట్లు వివరించాయి.

దుస్తుల కొరత

విపరీతమైన చలి ఉన్న నేపథ్యంలో చైనా సైనికులు పలు ఇబ్బందులు ఎదుర్కొటున్నారని అధికారులు తెలిపారు. సరైన దుస్తులు, వసతి సౌకర్యాలు లేక అనేక అవస్థలు పడుతున్నారని చెప్పారు. శీతల వాతావరణాన్ని తట్టుకొనే ప్రత్యేకమైన దుస్తుల కొరత ఏర్పడిందని.. వీటిని అత్యవసరంగా కొనుగోలు చేసేందుకు చైనా ఏర్పాట్లు చేసుకుందని తెలిపారు. ఇందుకోసం నాణ్యత పర్యవేక్షణ బృందాలను.. పీఎల్​ఏ జాయింట్ లాజిస్టిక్స్ సపోర్ట్ ఫోర్స్(జేఎల్ఎస్ఎఫ్) ఏర్పాటు చేసిందని చెప్పారు. సైన్యం పహారా కాస్తున్న ప్రాంతాలకు నాణ్యమైన దుస్తులను వేగంగా సరఫరా చేయాలని ఈ బృందానికి ఆదేశాలు జారీ అయినట్లు వెల్లడించారు. ఈ బృందం నేరుగా సెంట్రల్ మిలిటరీ కమిషన్​కు నివేదిస్తోందని పేర్కొన్నారు.

ఎల్​ఏసీ వద్ద ఎనిమిది నెలలుగా భారత్, చైనా సైనికుల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. సైనిక, దౌత్య మార్గాల్లో పలు దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ.. ఇంతవరకు ఎలాంటి ఫలితం లభించలేదు.

ఇదీ చదవండి- 'ఆక్స్​ఫర్డ్ టీకాపై తొందరొద్దు- ఫలితం మారొచ్చు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.