ETV Bharat / bharat

మహారాష్ట్రలో ఆలయాల పునఃప్రారంభానికి సీఎం గ్రీన్​సిగ్నల్​ - ఉద్ధవ్​ ఠాక్రే

మహారాష్ట్రలో సోమవారం నుంచి ఆలయాలు, ప్రార్థనా స్థలాలు తెరుచుకునేందుకు అనుమతిని ఇచ్చింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. అయితే.. ఉత్సవాల్లో పాల్గొనేవారు మాస్కులు, భౌతికదూరం వంటి నిబంధనల్ని తప్పనిసరిగా పాటించాలని సూచించారు సీఎం ఉద్ధవ్​ ఠాక్రే.

Uddhav Thakrey
మహారాష్ట్రలో ఆలయాల పునఃప్రారంభానికి సీఎం అనుమతి
author img

By

Published : Nov 14, 2020, 6:33 PM IST

మహారాష్ట్రలో నవంబర్​ 16(సోమవారం) నుంచి ఆలయాలు, ప్రార్థనా స్థలాలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్​ ఠాక్రే. ఫలితంగా సుదీర్ఘ లాక్​డౌన్​ అనంతరం అక్కడ ఆలయాలు, ప్రార్థనా స్థలాలు మళ్లీ తెరుచుకోనున్నాయి.

దీపావళి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు చెప్పిన ఠాక్రే.. కరోనా పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొద్ది రోజులుగా రాష్ట్రంలో కొవిడ్​ కేసులు తగ్గుముఖం పట్టాయని.. ఇంతటితో వైరస్​ పూర్తిగా పోలేదని, ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాల్సిన అవసరముందన్నారు. వేడుక ఏదైనా.. కరోనా మార్గదర్శకాలు(మాస్కులు, భౌతిక దూరం) తప్పనిసరి అని పునరుద్ఘాటించారు ఠాక్రే. క్రమశిక్షణతో మెలిగితే... దేవుని ఆశీర్వాదం తప్పక లభిస్తుందన్నారు.

జూన్​లో అన్​లాక్​ ప్రక్రియ ప్రారంభమైనా రాష్ట్రంలో మాత్రం ఆలయాలు మూసివేయడంపై పలుమార్లు విమర్శలు గుప్పించింది భాజపా. ఈ విషయం ఆ రాష్ట్ర గవర్నర్​ భగత్​ సింగ్​ కోశ్యారీ, ఠాక్రేల మధ్య వివాదానికీ దారితీసంది.

ఇదీ చదవండి: సరిహద్దులో ఐటీబీపీ జవాన్ల దీపావళి సంబరాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.