పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా దిల్లీలోని షహీన్ బాగ్లో గత కొద్ది రోజులుగా ఆందోళనలు ఉద్ధృతంగా జరుగుతున్నాయి. మంగళవారం అక్కడకు ఓ వ్యక్తి తుపాకీతో రావడం కలకలం రేపింది. నిరసనలకారుల మధ్యలోకి వచ్చిన అతను తుపాకీని గాల్లోకి ఎత్తగానే అక్కడున్న వాళ్లంతా అడ్డుకున్నారు. పట్టుకునేందుకు ప్రయత్నించగా గందరగోళం మధ్యే వారి నుంచి తప్పించుకుని పారిపోయాడు ఆ వ్యక్తి.
సమాచారం తెలుసుకున్న పోలీసులు తుపాకీతో వచ్చిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. అతని పేరు మమ్మద్ లుక్మాన్ అని.. అతడికి లైసెన్సు ఉన్న తుపాకీ ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. లుక్మాన్ స్థిరాస్తి వ్యాపారం చేస్తారని చెప్పాయి.