అద్భుత కట్టడాలకు నిలయమైన జైపుర్ నగరానికి అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చోటు కల్పించింది యునెస్కో. అజెర్బైజాన్లో జరుగుతున్న ప్రపంచ వారసత్వ కమిటీ 43వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది.
స్మారక చిహ్నాలు, ప్రాంతాల అంతర్జాతీయ మండలి (ఐసీఓఎమ్ఓఎస్) 2018లో జైపుర్ నగరంలో పర్యటించినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
ప్రధాని హర్షం..
జైపుర్‌కు వారసత్వ ప్రదేశాల జాబితాలో చోటు దక్కటంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.
" జైపుర్ సంస్కృతి, వీరత్వం కలగలిపిన నగరం. జైపుర్ ఆతిథ్యం ప్రపంచ నలుమూలల నుంచి ప్రజలను ఆకర్షిస్తోంది. ప్రపంచ వారసత్వ నగరంగా యునెస్కో గుర్తించటం సంతోషకరం. "
- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
ఇదీ చూడండి: ప్రపంచ వారసత్వ జాబితాలో హిర్కానియన్, వత్నాజోకుల్