కేరళ సీఎం పినరయి విజయన్ కూతురు వీణ వివాహం సోమవారం జరిగింది. ముఖ్యమంత్రి అధికారిక నివాసం క్లిఫ్ హౌస్‌లో జరిగిన ఈ వివాహానికి పలువురు రాజకీయ నేతలు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. డెమొక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డీవైఎఫ్ఐ) జాతీయ అధ్యక్షుడు, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు మహమ్మద్ రియాజ్‌ను వీణ పరిణయమాడారు. కరోనా నేపథ్యంలో నిబంధనలకు అనుగుణంగానే వివాహ మహోత్సవాన్ని నిర్వహించారు.
![Pinarayi Vijayan's daughter Veena ties knot with DYFI leader Muhammed Riyas](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/img-20200615-wa00311592199498868-98_1506email_1592199510_710_1506newsroom_1592206312_589.jpg)
విశ్రాంత ఎస్పీ పీ.ఎం అబ్దుల్ ఖాదర్ కుమారుడు రియాజ్. సీపీఎం అనుబంధ సంస్థ ఎస్ఎఫ్ఐ ద్వారా రాజకీయ జీవితం ప్రారంభించారు. 2009లో కోజికోడ్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేశారు. 2017లో డీవైఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు.
వీణ.. ఐటీ రంగంలో రాణిస్తున్నారు. ఒరాకిల్‌లో కన్సల్టెంట్‌గా, ఆర్పీ టెక్సాఫ్ట్ ఇంటర్నేషనల్ సీఈఓగా వ్యవహరించారు. ప్రస్తుతం బెంగళూరు ప్రధాన కార్యాలయంగా ఉన్న ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు.
![Pinarayi Vijayan's daughter Veena ties knot with DYFI leader Muhammed Riyas](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/img-20200615-wa00331592199476523-52_1506email_1592199488_402_1506newsroom_1592206312_975.jpg)