ETV Bharat / bharat

కరోనా రోగులతో డాక్టర్ల 'ఫోన్​ కొట్టు- ముచ్చట పెట్టు' - corona patients feeling lonely in isolations

సాధారణంగా వైద్యులు ఏం చేస్తారు..? రోగుల ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని అందుకు తగ్గ వైద్యం చేస్తారు. కానీ, దిల్లీలోని ఓ ఆసుపత్రిలో మాత్రం.. కరోనా బాధితులతో ముచ్చటిస్తున్నారు. నర్సులు బాధితులకు ఎప్పటికప్పుడు ఫోన్ చేసి పలకరిస్తున్నారు. ఇంతకీ ఆ ఆసుపత్రి సిబ్బంది ఉన్నట్టుండి కరోనా రోగులతో ఎందుకిలా మాటామంతి కార్యక్రమం చేపట్టారు..?

Phone calls, chit-chat: How a COVID facility in Delhi is helping patients fight corona, isolation
కరోనా రోగులకు ఫోన్​ చేసి మరీ ముచ్చటిస్తున్న డాక్టర్లు!
author img

By

Published : Jun 15, 2020, 11:14 AM IST

పక్క వీధిలో కరోనా సోకిన వ్యక్తి ఉన్నాడంటేనే ప్రాణం గజగజలాడిపోతుంది. అలాంటి 24 గంటలు కరోనా రోగుల పక్కనే ఉంటూ ప్రాణాలకు తెగించి వైద్యం చేస్తారు వైద్యులు. దిల్లీలోని రాజీవ్​గాంధీ సూపర్​ స్పెషాలిటీ ఆస్పత్రి డాక్టర్లు, నర్సులు అయితే వైద్యంతో పాటు .. నిర్బంధంలో ఉన్న రోగుల ఒంటరితనాన్నీ దూరం చేస్తున్నారు.

బతుకుపై భరోసా కల్పిస్తూ....

తూర్పు దిల్లీలో 500 పడకల సౌకర్యంతో.. కరోనా బాధితులకు వైద్యం అందిస్తోంది రాజీవ్​ గాంధీ ఆసుపత్రి. నెల రోజుల నుంచి 'మే ఐ హెల్ప్​ యూ' బృందాన్ని ఏర్పాటు చేసి రోగులతో ముచ్చటిస్తూ.. వారికి బతుకుపై భరోసా కల్పిస్తోంది.

"'చేరుకోలేని వారిని చేరుకుందాం' అనే నినాదంతో ఈ కార్యక్రమం ప్రారంభించాం. నిర్బంధంలో ఉన్నవారిలో ఒంటరితనాన్ని పోగొట్టి, బతుకుపై ఆశలు పెంచేందుకు ఈ కార్యక్రమం చేపట్టాం. ఇందులో భాగంగా నర్సులు బాధితులకు స్వయంగా ఫోన్లు చేస్తారు. వీలుంటే దగ్గరగా వెళ్లి మాట్లాడతారు. బాధితులు వారి అభిప్రాయాలను, జీవితంలో జరిగిన సంఘటనలను మాతో పంచుకుంటారు. ఆసుపత్రిలో అసౌకర్యాలేమైనా ఉంటే చెప్పుకుంటారు. వాటిని మేము పరిష్కరిస్తాం."

-డా. బీఎల్​ శేర్వాల్​, ఆసుపత్రి డైరక్టర్​

మూడు రోజుల క్రితమే కరోనాను జయించి... రాజీవ్​ గాంధీ సూపర్​ స్పెషాలిటీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్​ అయిన 65 ఏళ్ల అమెరికా మహిళ.. "రాజీవ్​ గాంధీ ఆసుపత్రి సిబ్బందికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు.. వారి సేవ అమోఘం. మీ నైపుణ్యం, చిట్కాలే నన్ను కాపాడాయి" అంటోంది.

"తబ్లీగీ జమాత్​ సభ్యుల్లో చాలా మందిని నిజాముద్దీన్​ నుంచి ఈ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అప్పట్లో వారిలో కొందరు వైద్యుల పట్ల ప్రవర్తించిన తీరును సామాజిక మాధ్యమాల్లో అందరూ చూశారు. ఓ సాధారణ మనిషిని నిర్భంధిస్తే.. తన మానసిక స్థితి ఎలా భిన్నంగా మారుతుందో ఆ వీడియోల్లో చూడొచ్చు. అందుకే, వారికి ముందు ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసి.. ఒంటరితనాన్ని దూరం చేస్తున్నాం. "

దిల్లీలో కరోనా విజృంభిస్తూనే ఉంది. శనివారం ఒక్కరోజులోనే 2,134 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 38 వేలు దాటిపోయింది.

ఇదీ చదవండి:'కరోనా దేవి'కి నిత్య పూజలు- రాజ్యాంగం ఇచ్చిన హక్కట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.