దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్‌పై సురేశ్ అనే వ్యక్తి దాడి చేశాడు. కొత్త దిల్లీ ఆప్ అభ్యర్థి బ్రిజేశ్ గోయల్ తరఫున మోతీనగర్‌లో ప్రచారం చేస్తున్న కేజ్రివాల్ చెంపపై కొట్టాడు. రోడ్‌షోలో ప్రసంగించిన అనంతరం ప్రజలకు అభివాదం చేస్తుండగా అకస్మాత్తుగా జీపుపైకి దూసుకొచ్చాడు ఆ వ్యక్తి. కేజ్రివాల్‌పై దాడికి దిగాడు.
దాడికి పాల్పడిన వ్యక్తిని చితకబాదారు ఆమ్ఆద్మీ కార్యకర్తలు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు.
వివరాలు వెల్లడించిన పోలీసులు
దాడి చేసిన వ్యక్తి కైలాశ్ పార్కు ప్రాంతానికి చెందిన సురేశ్‌గా గుర్తించామని తెలిపారు పోలీసు అధికారులు. ప్రస్తుతం తమ అదుపులోనే ఉన్నాడని, విచారణ కొనసాగిస్తున్నామని చెప్పారు.
కేజ్రివాల్‌పై భౌతికదాడి జరగడం ఇది రెండోసారి.