'తక్కువ ప్రభుత్వం- గరిష్ఠ పరిపాలన'లో భాగంగా అధికారుల పనితీరు ప్రమాణాలను మెరుగుపరచటం, ఆర్ధిక నిర్వహణలో క్రియాశీలమైన విధానాలను అభివృద్ధి చేయటమే కేంద్ర ప్రభుత్వం ముఖ్య ధ్యేయమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్థిక విభాగం ఆధ్వర్యంలో దిల్లీలోని డీఆర్డీవో కార్యాలయంలో 'ఇంటిగ్రేటెడ్ ఫినాన్స్ సలహాదారుల వర్క్షాపు'ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరయ్యారు రాజ్నాథ్.
"కేంద్ర బడ్జెట్లో 1/4 వంతు రక్షణ శాఖకు కేటాయిస్తున్నాం, అన్ని విభాగాలకు, మంత్రిత్వశాఖలు ఇంటిగ్రేటెడ్ ఫినాన్స్ వెన్నెముకల నిలుస్తోంది. అన్ని మంత్రిత్వ శాఖలు ఎటువంటి రాజీ పడకుండా బడ్జెట్లోని నిధులను సక్రమంగా వినియోగించినప్పుడే తమ ధ్యేయాలను, లక్ష్యాలను సాధించగలుగుతాయి."
-రాజ్నాథ్ సింగ్, రక్షణ మంత్రి
500 కోట్ల ఆదాయం...
గత మూడేళ్లలో రక్షణ శాఖకు మూలధనం, ఆదాయ సేకరణ, ఆర్ధిక పరమైన అధికారాలు ఇవ్వటం వల్ల 500 కోట్ల ఆదాయాన్ని సొంతంగా సేకరించినట్లు మంత్రి వెల్లడించారు.