పౌరసత్వ సవరణ చట్టాన్ని ఉద్దేశించి మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు భాజపా ఎంపీ మీనాక్షీ లేఖి. అక్షరాస్యునికి చదువు చెప్పాల్సిన అవసరం ఉందనేందుకు ఇది ఉదాహరణని ట్వీట్ చేశారు.
భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తొలిసారిగా స్పందించారు. "ప్రస్తుతం జరుగుతున్నది విచారకరం. మంచిది కాదు. భారత్‌కు వచ్చే బంగ్లాదేశ్ వలసదారుడు ఇన్ఫోసిస్ తదుపరి సీఈఓ అయితే చూడాలనుంది" అని పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలను జత చేస్తూ ట్వీట్ చేశారు మీనాక్షీ
"విద్యావంతులకు చదువెందుకు నేర్పాలో చెప్పేందుకు ఇదో ఉదాహరణ! పాకిస్థాన్ బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్లో వివక్షకు గురవుతున్న మైనార్టీలకు అవకాశాలు కల్పించడమే సీఏఏ ముఖ్య ఉద్దేశం. అమెరికాలో ఈ అవకాశాలను యజ్దీలకు కాకుండా సిరియన్ ముస్లింలకు ఇవ్వడం ఎలా?"
- మీనాక్షీ లేఖి ట్వీట్.