ETV Bharat / bharat

అక్కడ కారులోనూ హెల్మెట్​ ధరిస్తారు.. ఎందుకలా?

హెల్మెట్​ ధరించాలని ట్రాఫిక్​ పోలీసులు ఎంత మొత్తుకున్నా.. వేలకు వేలు జరిమానా విధించినా చాలా ప్రాంతాల్లో శిరస్త్రాణం లేకుండా వెళుతున్నవారు కనిపిస్తూనే ఉంటారు. అయితే ఓ ప్రాంతంలో ద్విచక్రవాహనంపైనే కాదు.. రోడ్డుపై నడుచుకుంటూ,సైకిల్​, కారులో వెళ్లేవారు.. వృత్తి, వయస్సు, లింగభేదం లేకుండా హెల్మెట్​ ధరిస్తున్నారు. మరి ఆ ప్రాంతం ఎక్కడుంది? అలా ఎందుకు చేస్తున్నారో తెలుసుకుందామా?

people wear helmet during walking car driving
పాదచారులు, సైకిల్​, కారులోనూ హైల్మెట్​.. అది ఎక్కడంటే?
author img

By

Published : Feb 22, 2020, 9:12 AM IST

Updated : Mar 2, 2020, 3:50 AM IST

పాదచారులు, సైకిల్​, కారులోనూ హైల్మెట్​

హెల్మెట్​.. ద్విచక్రవాహనదారులకు రక్షణకవచం. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాపాయం నుంచి రక్షిస్తుంది. అందుకే ద్విచక్రవాహనదారులకు శిరస్త్రాణం తప్పనిసరి చేసింది ప్రభుత్వం. హెల్మెట్​ లేకుండా రోడ్డెక్కితే.. వేల రూపాయలు జరిమానా విధిస్తున్నారు ట్రాఫిక్​ పోలీసులు. అయినా చాలా చోట్ల శిరస్త్రాణం లేకుండా వెళ్తన్న ద్విచక్రవాహనదారులు కనిపిస్తూనే ఉంటారు.

అయితే ఉత్తర్​ప్రదేశ్​ రాష్ట్రం ఆగ్రాలోని దయాల్​బాగ్​లో శిరస్త్రాణం ప్రాముఖ్యత గుర్తించి ద్విచక్రవాహనదారులే కాదు, సైకిల్​, కారు నడిపేవారితో పాటు పాదచారులు కూడా హెల్మెట్​ను ధరించి అవగాహన కల్పిస్తున్నారు.

రోడ్డుభద్రతపై సందేశం..

దయాల్​బాగ్​ ప్రజలు రోడ్డు ప్రమాదాల నుంచి రక్షించుకునేందుకు హెల్మెట్​ను తమ జీవితంలో భాగం చేసుకున్నారు. యువకులు, చిన్నారులు, ఉద్యోగులు, రైతులు, కూలీలు, మహిళలు, పురుషులు, ముసలివారు ఇలా అందరూ హెల్మెట్ ధరించి రోడ్డు భద్రతపై ఒక గొప్ప సందేశాన్ని అందిస్తున్నారు.

కారణం ఇదీ..

ఇటీవల రోడ్డు భద్రత, ట్రాఫిక్​పై​ అవగాహన కల్పించారు అధికారులు. హెల్మెట్​ ధరిస్తే కలిగే ఉపయోగాలను సవివరంగా చెప్పారు. దీంతో అధికారుల సూచనలను తూ.చ. తప్పకుండా పాటిస్తున్నారు దయాల్​బాగ్ ప్రజలు. పాదచారులు, సైకిల్​, కారులో రోడ్డుపై వెళుతున్నప్పుడు ఎక్కడి నుంచి ప్రమాదం పొంచి ఉందో ఊహించలేమని అందుకే హెల్మెట్ ధరిస్తున్నట్లు చెబుతున్నారు.

" 70 ఏళ్ల వరకు ఉన్న మహిళలు స్వీయరక్షణ కోసం ఊతకర్రను ఉపయోగిస్తున్నారు. అది జీవితంలో ఒక భాగం. వ్యాయామంలో భాగంగా కర్రను తీసుకెళుతున్నాం. అలాగే హెల్మెట్​ కూడా రక్షణ ఇస్తుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఎవరు ఢీకొడతారో తెలియదు కదా."

- ఇందు మిశ్రా, దయాల్​బాగ్​ నివాసి.

రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయాలై ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలు పెరుగుతున్న కారణంగా హెల్మెట్​ను తప్పనిసరిగా చేసుకున్నామని మరికొందరు చెబుతున్నారు. ముఖ్యంగా సైకిల్​, ద్విచక్రవాహనంపై వెళుతున్న వారు తప్పనిసరిగా ధరిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు శిరస్త్రాణం ధరించటాన్ని ప్రేరణగా తీసుకుని సమీప ప్రాంతాల వారూ హెల్మెట్ వాడుతున్నట్లు పేర్కొన్నారు స్థానికులు.

" మా యజమాని ఆదేశాలు మేము అనుసరిస్తాం. భద్రత కోసం తప్పనిసరిగా హెల్మెట్​ ధరించాలని మా యజమాని చెప్పారు. ఈ కారణంగానే హెల్మెట్​ ధరించి కారులో ప్రయాణిస్తున్నాం."

- మీనాక్షి, భాస్కర్​, దయాల్​బాగ్​ నివాసి

ఇదీ చూడండి: ట్రంప్ తాజ్​మహల్​ పర్యటనకు కోతుల బెడద

Last Updated : Mar 2, 2020, 3:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.