లాక్డౌన్ కారణంగా మద్యం దొరక్క ఇక్కట్లు పడుతున్న మందుబాబుల దాహార్తి తీర్చేందుకు సోమవారం ఉదయం నుంచి లిక్కర్ దుకాణాలు తెరిచింది అసోం ప్రభుత్వం. ఎంతోకాలంగా ఒక్కచుక్క మందైనా దొరక్కపోదా అని ఎదురు చూస్తున్న మద్యం ప్రియులు.. భారీ సంఖ్యలో లిక్కర్ షాపుల ముందు బారులు తీరారు.
యువత, కొంతమంది మహిళలు, వృద్ధులు.. మద్యం దుకాణాల ముందు భౌతిక దూరం పాటిస్తూ క్యూలో నిల్చున్నారు. ప్రతి రోజు 7 గంటల పాటు మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతిలిస్తూ అసోం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
![People line up outside a liquor shop in Dibrugarh as government permits sale of liquor between 10 AM & 5 PM during CoronavirusLockdown.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6772342_543_6772342_1586761152081.png)
![liquor](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6772342_sss.jpg)
![liquor](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6772342_sssda.jpg)