దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న వేళ కర్ణాటక రామనగర జిల్లాలోని ఓ గ్రామంలో పెద్ద ఎత్తున ఉత్సవం జరిగింది. కోలగొండనహల్లి గ్రామంలో గురువారం జరిగిన ఈ వేడుకకు గ్రామ పంచాయితీ సెక్రెటరీ అనుమతించినట్లు గ్రామస్థులు తెలిపారు. విషయంపై స్పందించిన రామనగర డిప్యూటీ కమిషనర్.. ఆ అధికారిని సస్పెండ్ చేశారు.
ఇప్పటికే దేశంలో కరోనా కేసులు 80 వేలు దాటాయి. 2,649 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. కర్ణాటకలో ఇప్పటివరకు 987 మందికి వైరస్ సోకగా.. 35 మంది మరణించారు.