ETV Bharat / bharat

మద్యం కొంటే వేలికి సిరా వేయించుకోవాల్సిందే! - lockdown latest news

బయటకు వెళ్లి మద్యం కొనుగోలు చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త! మందు కొనుగోలు చేసిన వారికి చెరిగిపోని సిరా​తో వేలిపై ముద్ర వేస్తున్నారు అబ్కారీ అధికారులు. అంతేకాదు.. పేరు, ఆధార్​ వంటి వివరాలనూ నమోదు చేసుకుంటున్నారు.

alcohol stamp
వేలికి సిరా
author img

By

Published : May 8, 2020, 3:07 PM IST

మధ్యప్రదేశ్​ హోషంగాబాద్​ జిల్లాలో మద్యం కొనుగోలు చేసినవారి చేతికి సిరా​తో వేలిపై ముద్ర వేస్తున్నారు అబ్కారీ అధికారులు. భవిష్యత్తులో ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే త్వరగా గుర్తించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు జిల్లా అబ్కారీ అధికారి అభిషేక్ తివారి.

"మద్యం కొనుగోలు చేసేందుకు వచ్చినవారి వేలికి చెరిగిపోని ఇంక్​తో ముద్ర వేస్తున్నాం. భవిష్యత్తులో అవసరమైతే వీరిని గుర్తించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. వినియోగదారుల పేరు, చిరునామా, మొబైల్​ నంబర్ తదితర వివరాలను రిజిస్టర్​లో నమోదు చేసుకుంటున్నారు మద్యం దుకాణదారులు."

- అభిషేక్ తివారి, అబ్కారీ అధికారి, హోషంగాబాద్​

జిల్లాలోని నాన్​కంటైన్మెంట్​ జోన్లలోని 50 దుకాణాలు తెరిచినట్లు అభిషేక్​ తెలిపారు. వీటన్నింటిలో వివరాలను నమోదు నమోదు చేసుకుంటున్నట్లు చెప్పారు. కరోనా వ్యాప్తికి సంబంధించిన కాంటాక్ట్ ట్రేసింగ్​ కోసం అవసరమైతే వీటిని ఉపయోగిస్తామని తెలిపారు.

ఇదీ చూడండి: మందుబాబులకు ఇంటికే మద్యం.. 'సర్కార్'​ గ్రీన్​ సిగ్నల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.