ETV Bharat / bharat

బలవంతంగా డిస్చార్జ్​- 50కి.మీ నడిచి స్పృహ తప్పిన రోగి - lockdown

కర్ణాటక ప్రభుత్వ ఆస్పత్రిలో కేరళకు చెందిన ఓ రోగిని బలవంతంగా డిస్చార్జ్​ చేశారు అధికారులు. అతడు 50కిలోమీటర్లు దూరం నడిచి కేరళ సరిహద్దు ప్రాంతంలో మూర్ఛపోయినట్లు పోలీసులు తెలిపారు.

Patient forcibly discharged, faints after walking nearly 50 km
రోగిని బలవంతంగా డిస్చార్జ్​ చేసిన ఆస్పత్రి అధికారులు
author img

By

Published : Apr 1, 2020, 3:59 PM IST

కర్ణాటక మంగళూరులోని ప్రభుత్వ ఆస్పత్రి నుంచి కేరళకు చెందిన ఓ రోగిని బలవంతంగా డిస్చార్జ్​ చేశారు. అతడు 50 కిలోమీటర్లు దూరం నడిచి కేరళ సరిహద్దు ప్రాంతంలో సొమ్మసిల్లి పడిపోయాడని పోలీసులు తెలిపారు.

ఇదీ జరిగింది...

కేరళలోని కాసరగోడ్​ జిల్లాకు చెందిన బాలన్​ అనే వ్యక్తి కొబ్బరి చెట్టు మీద నుంచి పడిపోయాడు. అతని బందువులు మార్చి 21న కర్ణాటక మంగళూరులో ఓ ఆస్పత్రిలో చేర్చారు. ఆ ఆస్పత్రిలో కొన్ని రోజులు చికిత్స పొందాడు. అయితే ఉన్నట్టుండి ఆస్పత్రి అధికారులు బాలన్​ను డిస్చార్జ్​ చేసి బలవంతంగా బయటకు పంపించివేశారు. లాక్​డౌన్​తో వాహనాలు తిరిగే అవకాశం లేకపోవడం వల్ల అక్కడి నుంచి కేరళవైపు నడవడం ప్రారంభించాడు. అలా వస్తూ సరిహద్దు ప్రాంతంలో స్పృహ తప్పి పడిపోయాడని పోలీసులు తెలిపారు. బాధితుడికి, అతని బందువుల కోసం వాహనాన్ని ఏర్పాటు చేసి, స్వస్థలానికి చేర్చినట్లు చెప్పారు.

లాక్​డౌన్​ సహా కేరళలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఇప్పటికే కర్ణాటక సరిహద్దులను మూసి వేసింది. ​కాసర్​గోడ్​కు దగ్గర్లోని మంగళూరు ఆస్పత్రులకు వెళ్లేందుకు వీలు లేక ఇప్పటికే ఏడుగురు మరణించారు.

ఇదీ చూడండి: మద్యం ప్రియులను 'ఏప్రిల్​ ఫూల్స్​' చేసిన వైన్​ షాపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.