ETV Bharat / bharat

'వ్యవసాయ బిల్లులతో రైతుల జీవితాల్లో మార్పులు తథ్యం' - నరేంద్ర సింగ్​ తోమర్ వార్తలు

పార్లమెంటులో వ్యవసాయ బిల్లులు ఆమోదం పొందిన నేపథ్యంలో హర్షం వ్యక్తం చేశారు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​. ఈ బిల్లులు చారిత్రాత్మకమైనవని అభిప్రాయపడిన మంత్రి​.. వీటి ద్వారా రైతుల జీవితాల్లో అనేక మార్పులొస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలాంటి బిల్లులపై విపక్షాలు రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు తోమర్​.

Passage of agricultural bill is historic day for farmers, opposition should not spread confusion: Narendra Singh Tomar
వ్యవసాయ బిల్లులతో రైతుల జీవితాల్లో మార్పులు తథ్యం
author img

By

Published : Sep 20, 2020, 10:34 PM IST

తీవ్ర గందరగోళం మధ్య ఆదివారం వ్యవసాయ బిల్లులకు పార్లమెంట్​ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​ హర్షం వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం కేంద్రం ప్రతిపాదించిన ఈ రెండు బిల్లులు.. రైతుల జీవితాల్లో పెను మార్పులు తీసుకువస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థ కూడా మరింత బలోపేతమవుతుందని అభిప్రాయపడ్డారు తోమర్​.

బిల్లుల విషయంలో.. విపక్షాలు రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు 'ఈటీవీ భారత్'​తో మాట్లాడారు కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​.

'ఈటీవీ భారత్'తో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​

"వ్యవసాయానికి సంబంధించిన ఈ రెండు బిల్లులు చారిత్రాత్మకమైనవి. రైతుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తాయి. ఇకపై వ్యవసాయదారులు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా స్వేచ్ఛగా విక్రయించుకోవచ్చు. ప్రధాని మోదీ.. తన నాయకత్వంలో రైతుల ప్రయోజనాలను పరిరక్షించారు."

- నరేంద్ర సింగ్​ తోమర్​, కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి

వ్యవసాయం రంగంలో సంస్కరణల కోసం కేంద్రం ప్రతిపాదించిన బిల్లులకు పార్లమెంటు ఆమోదం లభించింది. ఇప్పటికే లోక్​సభ గడప దాటిన ఫార్మర్స్‌ ప్రొడ్యూస్‌ ట్రేడ్‌ అండ్‌ కామర్స్‌ (ప్రమోషన్‌ అండ్‌ ఫెసిలిటేషన్‌), ఫార్మర్స్‌ (ఎంపవర్‌మెంట్‌ అండ్‌ ప్రొటెక్షన్‌) అగ్రిమెంట్‌ ఆన్‌ ప్రైస్‌ అష్యూరెన్స్‌ అండ్‌ ఫామ్‌ సర్వీసెస్‌ బిల్లులను.. గందరగోళం మధ్య సెప్టెంబర్​ 20న రాజ్యసభ ఆమోదించింది. బిల్లులను విపక్షాలు వ్యతిరేకించాయి. కార్పొరేట్ శక్తులకు మేలు చేకుర్చేందుకు వీటిని తీసుకొచ్చారని ధ్వజమెత్తాయి.

ఇదీ చదవండి:

రాజ్యసభ లోపలే విపక్షాల ధర్నా- మండిపడ్డ నడ్డా

'వ్యవసాయ భారతంలో చారిత్రక మలుపు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.