ETV Bharat / bharat

కీలకమైన మూడు కార్మిక బిల్లులకు ఆమోదం

కార్మిక చట్టాలను ఏకీకృతం చేసే మూడు బిల్లులకు పార్లమెంట్ ఆమోదం లభించింది. ఫలితంగా నాలుగు కార్మిక కోడ్​ల ఏర్పాటు దాదాపుగా పూర్తయింది. పారిశ్రామిక సంబంధాల కోడ్​.. చట్టరూపం దాల్చితే 300 కన్నా తక్కువ మంది కార్మికులు ఉన్న సంస్థలు ప్రభుత్వ అనుమతి లేకుండానే సిబ్బందిని తొలగించే అవకాశం లభిస్తుంది.

Parliament passes 3 key labour reform bills
కీలకమైన మూడు కార్మిక బిల్లులకు పార్లమెంట్​ ఆమోదం
author img

By

Published : Sep 23, 2020, 7:09 PM IST

కార్మిక చట్టాల్లో సంస్కరణలకు ఉద్దేశించిన మూడు కీలకమైన బిల్లులకు పార్లమెంట్ ఆమోదం లభించింది. పారిశ్రామిక సంబంధాలు, సామాజిక భద్రత, వృత్తిపరమైన రక్షణ కోడ్​లకు రాజ్యసభ పచ్చజెండా ఊపింది. విపక్షాలు సభను బహిష్కరించడం వల్ల మూజువాణి ఓటుతో వీటిని ఆమోదించింది.

ఈ మూడు బిల్లులను లోక్​సభ మంగళవారం ఆమోదించింది. ఈ నేపథ్యంలో బిల్లులను రాష్ట్రపతి సమ్మతి కోసం పంపించనున్నారు.

పారదర్శకత కోసమే

మారిన వ్యాపార వాతావరణానికి అనుగుణంగా పారదర్శకమైన వ్యవస్థను రూపొందించడమే ఈ కార్మిక సంస్కరణలు ప్రధాన ఉద్దేశమని కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ పేర్కొన్నారు. 300లోపు కార్మికులు ఉన్న సంస్థలకు ప్రభుత్వ అనుమతి లేకుండానే మూసివేసేందుకు పారిశ్రామిక సంబంధాల కోడ్​లో అనుమతి ఇవ్వడంపై వివరణ ఇచ్చారు. ప్రస్తుతం 100గా ఉన్న నిబంధనను 300కి పెంచడంపై స్పష్టతనిచ్చారు. కార్మికుల అంశం రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో ఉందని గుర్తు చేశారు.

"ఇప్పటికే 16 రాష్ట్రాలు ఈ పరిమితిని 300కి పెంచాయి. పార్లమెంటరీ కార్మిక స్థాయీ సంఘం సైతం ఇదే సిఫార్సు చేసింది. చాలా సంస్థలు తమ కార్మికుల సంఖ్యను 100కు మించి పెంచవు. ఫలితంగా అనధికార ఉద్యోగాలు పెరిగిపోతున్నాయి. 2019 ఆర్థిక సర్వే ప్రకారం రాజస్థాన్​లో ఉద్యోగ కల్పన మెరుగుపడింది. సిబ్బందిని తొలగించిన దాఖలాలు గణనీయంగా తగ్గాయి. కాబట్టి ఒక నిబంధన మార్చడం ద్వారా పెద్ద కర్మాగారాలను స్థాపించడానికి పెట్టుబడిదారులకు ప్రోత్సాహం లభిస్తుంది. తద్వారా దేశ కార్మికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి."

-సంతోష్ కుమార్ గంగ్వార్, కేంద్ర కార్మిక శాఖ మంత్రి

తాజా బిల్లులు కార్మికుల ప్రయోజనాలను పరిరక్షిస్తాయని తెలిపారు గంగ్వార్. ఉద్యోగుల భవిష్య నిధి పరిధి పెంచడం ద్వారా సామాజిక భద్రత అందుతుందని పేర్కొన్నారు. 40 కోట్ల మంది అసంఘటిత కార్మికులకు ఈ చర్య ప్రయోజనకరంగా ఉంటుందని వెల్లడించారు.

29 చట్టాలు నాలుగు కోడ్​లుగా

ఈ సందర్భంగా 23 లేబర్ చట్టాలను నాలుగు కోడ్​లుగా విలీనం చేయడం పూర్తయిందని మంత్రి పేర్కొన్నారు. నాలుగు కోడ్​లలో ఒకటైన.. వేతనాల కోడ్​ను పార్లమెంట్ గతేడాదే ఆమోదించింది. మిగిలిన మూడు కార్మిక కోడ్​లకు తాజా వర్షాకాల సమావేశాల్లో ఉభయసభల అంగీకారం లభించింది. ఫలితంగా 29 కేంద్ర కార్మిక చట్టాలను నాలుగు కోడ్​లుగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ ఆలోచన కార్యరూపం దాల్చినట్లైంది. రాష్ట్రపతి ఆమోదం లభిస్తే ఇవి పూర్తి స్థాయి కోడ్​లుగా అమలవుతాయి.

Parliament passes 3 key labour reform bills
మూడు కార్మిక బిల్లులకు పార్లమెంట్​ ఆమోదం

నాలుగు కోడ్​లు ఇవే

  1. వృత్తిపరమైన రక్షణ, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్, 2020- సంస్థలో చేరిన కార్మికులకు వృత్తి పరమైన రక్షణ, వైద్య సేవలతో పాటు పని ప్రదేశంలోని పరిస్థితులకు సంబంధించిన చట్టాలన్నీ ఈ కోడ్ పరిధిలోకి వస్తాయి.
  2. పారిశ్రామిక సంబంధాల కోడ్, 2020- ట్రేడ్ యూనియన్లు, పారిశ్రామిక వివాదాల పరిష్కారానికి సంబంధించిన చట్టాలను ఈ కోడ్ ఏకీకృతం చేస్తుంది.
  3. సామాజిక భద్రత కోడ్, 2020- సంఘటిత, అసంఘటిత రంగంలోని కార్మికులు, ఉద్యోగులందరికీ సామాజిక భద్రత కల్పించే చట్టాలు ఈ కోడ్ పరిధిలోకి వస్తాయి.
  4. వేతనాల కోడ్, 2019- దీన్ని పార్లమెంట్ గతేడాది ఆమోదించింది. వేతన చెల్లింపు చట్టం-1936, కనీస వేతన చట్టం-1948, బోనస్ చెల్లింపు చట్టం-1965, సమాన వేతన చట్టం-1976 సహా పలు చట్టాలను ఇది ఒక గూటికి చేర్చింది.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.