ETV Bharat / bharat

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నేటితో ముగింపు!

పార్లమెంట్ సమావేశాలు బుధవారంతో ముగియనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఐదు బిల్లులపై నిర్ణయం తీసుకున్న తర్వాత రాజ్యసభ నిరవధిక వాయిదా పడనున్నట్లు స్పష్టం చేశారు. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే లోక్​సభ.. కొన్ని అంశాలపై చర్చించి అనంతరం వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది.

PAR-MONSOON SESSION
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
author img

By

Published : Sep 23, 2020, 5:00 AM IST

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు షెడ్యూల్ సమయానికి ఎనిమిది రోజుల ముందే ముగియనున్నట్లు తెలుస్తోంది. కరోనా భయాల మధ్య ఉభయ సభల సమావేశాలను బుధవారం నిరవధిక వాయిదా వేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

బుధవారం ఐదు బిల్లులపై చర్చ అనంతరం రాజ్యసభ వాయిదా పడనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే, మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కావాల్సిన లోక్​సభ.. సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్నట్లు స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. శూన్య గంటతో పాటు పలు అంశాలపై చర్చించిన తర్వాత లోక్​సభనూ నిరవధికంగా వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు.

ఎంపీలకు కరోనా..

సమావేశాలను కుదించాలన్న నిర్ణయాన్ని లోక్​సభలోని అన్ని పార్టీల నేతలకు తెలియచేసినట్లు సమాచారం. కొద్ది రోజుల్లో మంత్రులతో పాటు పలువురు ఎంపీలు కరోనా బారిన పడ్డారు. మరోవైపు విపక్ష పార్టీలు 8 మంది ఎంపీల సస్పెన్షన్​కు నిరసనగా పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించాయి.

వారం రోజులు ముందుగానే..

సెప్టెంబర్ 14న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్సులకు చట్టరూపం ఇచ్చే బిల్లులు పార్లమెంట్ ఆమోదం పొందాయి. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 1 వరకు సమావేశాలు జరగాల్సి ఉంది.

ఇదీ చూడండి: 'కుదిరితే నా దారి.. లేదంటే రహదారి వైఖరి తగదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.