ETV Bharat / bharat

లంచ్​ బాక్స్​లపై పార్లమెంట్​ సిబ్బందికి వింత రూల్స్​

పార్లమెంట్​ ప్రాంగణంలో ఇక నుంచి ఎవరూ తమ లంచ్​ బాక్స్​లను కడగడానికి వీల్లేదు. పాత్రలను శుభ్రం చేసుకోవడానికి అవకాశం లేదు. ఈ మేరకు ఓ కొత్త సర్కులర్​ను తీసుకువచ్చింది లోక్​సభ సచివాలయం. ఎందుకంటారా?

Parliament House bans washing of utensils, lunch boxes
'పార్లమెంట్​ భవనంలో లంచ్​ బాక్స్​లను కడగడానికి వీల్లేదు'
author img

By

Published : Oct 23, 2020, 3:52 PM IST

పార్లమెంట్​ ప్రాంగణంలో సరికొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తమ లంచ్​ బాక్స్​లను, ఇతర పాత్రలను కడగరాదని లోక్​సభ సచివాలయం స్పష్టంచేసింది. ఈ మేరకు ఓ సర్కులర్​ జారీ చేసింది.

"పార్లమెంట్​ భవన సముదాయంలో.. పాత్రలను, లంచ్​ బాక్స్​లను కడుగుతున్నందున డ్రైనేజీకి ఆటంకం ఎదురవుతోంది. ఇది పారిశుద్ధ్య సమస్యలను తెచ్చిపెడుతోంది. దుర్గంధం వ్యాపిస్తోంది. దయచేసి వాష్​రూమ్​లలో ఎవరూ పాత్రలు కడగవద్దు. పరిశుభ్రతను పాటించడంలో అందరూ సహకరించండి."

-- లోక్​సభ సచివాలయం

'ఇలా ఎప్పుడూ లేదు'

రాజ్యసభ ప్రాంగణంలోనూ ఈ నిబంధనలు వర్తిస్తాయని లోక్​సభ సాధారణ కార్యకలాపాల శాఖ స్పష్టం చేసింది. అయితే, దీనిపై పార్లమెంట్​లో​ ఏళ్ల తరబడి పని చేస్తున్న సిబ్బంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమను ఇంతకుముందెవరూ ఇలా అడ్డుకోలేదని అంటున్నారు. కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంలో భాగంగానే.. ఈ తరహా నిబంధనలను తీసుకువచ్చామని పార్లమెంట్​లోని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

ఇదీ చూడండి:దేశంలో 7 లక్షల దిగువకు క్రియాశీల కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.