ETV Bharat / bharat

ధన్యవాద తీర్మానానికి లోక్​సభ ఆమోదం

rajyasabha live
పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలు
author img

By

Published : Feb 10, 2021, 9:24 AM IST

Updated : Feb 10, 2021, 7:44 PM IST

19:40 February 10

బ్యాంకు రుణాలతో పెట్రోల్!

కేంద్రం తీసుకొచ్చిన బడ్జెట్​పై విమర్శలు కురిపించారు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్. మధ్యతరగతి వర్గానికి సాంత్వన కలిగించేలా బడ్జెట్​లో ఎలాంటి అంశాలు లేవన్నారు. పెట్రోల్ కొనుగోలు చేసేందుకు బ్యాంకులు రుణాలు మంజూరు చేయాల్సి ఉంటుందని ఎద్దేవా చేశారు.

"వైద్య, రక్షణ రంగాల్లో కేటాయింపులపై ప్రజలను మోసం చేసే బడ్జెట్ ఇది. జై జవాన్, జై కిసాన్ అని లాల్ బహదూర్ శాస్త్రి నినాదమిచ్చారు. కానీ రైతులు, సైనికులకు ప్రాధాన్యం ఇవ్వని బడ్జెట్ ఇది. మధ్యతరగతి వర్గం కోసం మీరు పెట్రోల్ ధరలు పెంచారు. 2014 తర్వాత పెట్రోల్​పై ఎక్సైజ్ సుంకం 348 శాతం పెరిగింది. పెట్రోల్ కొనేందుకు బ్యాంకులు త్వరలోనే రుణ సదుపాయాన్ని కల్పించాల్సి ఉంటుంది."

-శశిథరూర్, కాంగ్రెస్ ఎంపీ

19:30 February 10

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని మూజువాణి ఓటుతో లోక్​సభ ఆమోదించింది. ప్రధాని మోదీ ప్రసంగించిన తర్వాత.. తీర్మానంపై వచ్చిన సవరణలపై ఓటింగ్ నిర్వహించారు స్పీకర్ ఓం బిర్లా.  

మోదీ ప్రసంగిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ సభ నుంచి వెళ్లిపోగా.. ఆయన స్పందనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ డీఎంకే, టీఎంసీ సభ్యులు వాకౌట్ చేశారు. ఈ మూడు పార్టీల సభ్యులు ఓటింగ్​కు గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో తీర్మానానికి ప్రతిపాదించిన సవరణలను.. సభ్యులు మూజువాణి ఓటుతో తిరస్కరించారు.  

17:41 February 10

పార్టీని బాగు చేసుకోరు..

లోక్​ సభ నుంచి కాంగ్రెస్​ ఎంపీలు వాకౌట్​ చేసిన సమయంలో మోదీ.. ఆ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ చీలిపోయి.. సందిగ్ధంలో పడిందన్నారు. కాంగ్రెస్​ నాయకులు.. వారి పార్టీని బాగు చేసుకోరు.. దేశంలోని సమస్యలను పరిష్కరించనీయరని ఎద్దేవా చేశారు.  

17:32 February 10

కాంగ్రెస్​ ఎంపీలు వాకౌట్​

లోక్​సభలో మోదీ ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్​ ఎంపీలు వాకౌట్​ చేశారు.

17:15 February 10

  • 1975 వరకు దేశంలో సీసీఏ ముఖ్య కార్యదర్శి ఉద్యోగం ఉంది: మోదీ
  • సీసీఏ అంటే... చర్చిల్‌ సిగార్ అసిస్టెంట్‌: మోదీ
  • 1940లో చర్చిల్‌కు చుట్టలు అందించేందుకు ఈ చట్టం తెచ్చారు: మోదీ
  • ఆంగ్లేయులు తెచ్చిన చట్టాలను కూడా మార్చవద్దా: మోదీ

17:01 February 10

దేశ ప్రగతికి కొత్త సాగు చట్టాలు అవసరం

  • దేశ ప్రగతికి కొత్త సాగు చట్టాలు అవసరం: మోదీ
  • సమాజంలో మార్పు కోసం మరిన్ని కొత్త చట్టాలు తేవాల్సిన అవసరం ఉంది: మోదీ
  • కాలం చెల్లిన చట్టాలతో దేశం ముందుకెళ్లడం కష్టం: మోదీ
  • కాంగ్రెస్‌ పార్టీ.. లోక్‌సభలో ఒకలా, రాజ్యసభలో మరోలా ప్రవర్తిస్తోంది: మోదీ
  • సాగు చట్టాలపై కాంగ్రెస్ నేతలు గందరగోళంలో ఉన్నారు: మోదీ
  • సమాజంలో మార్పు కోసం, ప్రగతి కోసం ఎందరో కృషి చేశారు: మోదీ
  • ఇంత వైవిధ్య దేశంలో ఏ నిర్ణయానికైనా వందశాతం ఆమోదం రాదు: మోదీ
  • ఎక్కువమంది ప్రజలకు లబ్ధి కలిగించే నిర్ణయాలు తీసుకోవాలి: మోదీ
  • ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వాలు నడవాలి: మోదీ
  • స్వచ్ఛ భారత్‌, జన్‌ధన్‌ ఖాతాలు కావాలని ప్రజలెవరూ అడగలేదు: మోదీ
  • ఇవాళ ఎంతోమంది ఆ పథకాలను ప్రశంసిస్తున్నారు: మోదీ
  • యాచించే స్థాయి నుంచి ఆత్మగౌరవంతో బతికేలా మారుస్తున్నాం: మోదీ
  • దేశంలో ఎలాంటి మార్పులు రాకూడదని కొందరు కోరుకుంటారు: మోదీ
  • దేశ ప్రగతి కోసం అందరూ ఆలోచించాలి: మోదీ

16:50 February 10

రైతుల ఆదాయం పెరిగేందుకు అనేక కార్యక్రమాలు: మోదీ

వ్యవసాయ రంగం అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టామని, రైతులకు కనీస మద్దతుధర అందించేందుకు కృషి చేస్తున్నట్లు మోదీ గుర్తు చేశారు. రైతుల ఆదాయం పెరిగేందుకు అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులకు మద్దతు ధర దక్కాలని తాము కూడా కోరుకుంటున్నట్లు మోదీ అన్నారు. ఆరుగాలం కష్టపడే రైతులకు గిట్టుబాటు ధర దక్కాల్సిందే అని నొక్కి చెప్పారు. ఈ విషయంలో రైతుసంఘాలతో అనేకసార్లు చర్చలు జరిపినట్లు చెప్పారు.  

సాగు చట్టాలతో దేశంలో ఎక్కడైనా వ్యవసాయ మార్కెట్లు మూతబడ్డాయా?  రైతులకు ఎక్కడైనా మద్దతుధర దక్కలేదా?  అని మోదీ ప్రశ్నించారు. సభలో కావాలనే కొందరు తన ప్రసంగాన్ని అడ్డుకుంటున్నట్లు మోదీ చెప్పారు. కొత్త సాగు చట్టాలతో ఒక్క రైతుకూ నష్టం జరగదన్నారు మోదీ. రైతులకు నష్టం కలిగించే చట్టాలను తాము ఎందుకు తీసుకొస్తామని మోదీ విపక్షాలను ప్రశ్నించారు. సాగు చట్టాలపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, ఇప్పటికే ఉన్న వ్యవసాయ మార్కెట్లపై ఎలాంటి ఆంక్షలు లేవన్నారు మోదీ.

16:45 February 10

దేశ ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది:మోదీ

కరోనాతో పోరులో దేశ ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందని, లాక్‌డౌన్‌, కర్ఫ్యూల వల్ల అనేక ఆర్థిక కష్టాలు, నష్టాలు వచ్చాయని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వేళ 75 కోట్ల మందికి 8 నెలలపాటు రేషన్ సరకులు సరఫరా చేసినట్లు, ఆధార్‌, జన్‌ధన్‌ ఖాతాల ద్వారా కోట్లమందికి ప్రయోజనం చేకూరిందని మోదీ పునరుద్ఘాటించారు. తమ ప్రభుత్వం వచ్చిన మొదటిరోజు నుంచి అనేక సంస్కరణలను తీసుకొచ్చినట్లు, అందులో ఉత్పత్తి రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు మోదీ వివరించారు. తప్పకుండా  రెండంకెల వృద్ధి రేటు సాధిస్తామని నిపుణులు అంచనా వేస్తున్నట్లు మోదీ చెప్పుకొచ్చారు.

16:40 February 10

ఫార్మా రంగంలో ఆత్మనిర్భర్ సాధించాం

గొప్ప శక్తిగా ఎదిగేందుకు భారత్ కృషి ప్రయస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ఆ దిశగా వెళ్లేందుకే ఆత్మ నిర్భర్ భారత్‌ నినాదం ఎత్తుకున్నట్లు చెప్పారు. ఫార్మా రంగంలో భారత్​ ఇప్పటికే ఆత్మ నిర్భర్ సాధించినట్లు వివరించారు. భారత్​ నలుమూలలా స్థానికత నినాదం పెరిగిందని, ఆత్మ నిర్భర భారత్ దిశగా వస్తువులు గ్రామాల్లోనే తయారీ కావాలన్నారు మోదీ. కరోనా వేళ కనిపించని శత్రువుతో ప్రపంచం పోరాటం చేసింది చేసిందని, 130 కోట్ల ప్రజల సంకల్ప శక్తితో కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చారు మోదీ. దేవుడి దయ వల్ల కరోనా కష్టాల నుంచి దేశం బయటపడినట్లు ప్రధాని పేర్కొన్నారు. దేవుడి రూపంలో వైద్యులు, నర్సులు, పారిశుద్ధ కార్మికులు వచ్చారని మోదీ అన్నారు.

16:35 February 10

ప్రపంచ దేశాలకు భారత్​ మార్గసూచిగా ..

కరోనా వేళ ప్రపంచ దేశాలకు భారత్​ మార్గసూచిగా నిలిచిందన్నారు ప్రధాని. ప్రపంచ ప్రజలంతా  బాగుండాలని కోరుకునే దేశం మనదన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత శాంతికి ప్రాధాన్యత పెరిగిందని, శాంతి చర్చల మధ్యే కొన్ని దేశాలు  సైనికశక్తిని పెంచుకున్నట్లు చెప్పారు ప్రధాని.  కొన్ని దేశాలు ఆధునిక యుద్ధ సామగ్రి సిద్ధం చేసుకుంటున్నాయని, కరోనా సంక్షోభం తర్వాత ప్రపంచ దేశాల ప్రణాళికలు మారినట్లు వెల్లడించారు.

16:30 February 10

మరో పాతికేళ్లలో భారత్​ అత్యున్నత స్థాయిలో..

2047 నాటికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తవుతాయని, మరో పాతికేళ్లలో భారత్​ అత్యున్నత స్థాయిలో నిలబడాలని ఆకాంక్షించారు మోదీ. ప్రపంచ ఆశాకిరణంగా మనదేశం మారిందన్నారు. ప్రపంచ దేశాల్లో భారత్‌కు ప్రాధాన్యం పెరిగిందన్నారు ప్రధాని. మనదేశం వైవిధ్యానికి మారుపేరని, వైవిధ్యంలోనూ మనం ఏకతాటిపై నడుస్తున్నట్లు పేర్కొన్నారు.

16:24 February 10

రాష్ట్రపతి ప్రసంగం భారత సంకల్ప శక్తిని చాటింది

రాష్ట్రపతి చేసిన ప్రసంగం భారత సంకల్ప శక్తిని చాటినట్లు మోదీ పేర్కొన్నారు. ఆయన మాటలు దేశ ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయన్నారు. కరోనా కష్టాల్లోనూ దేశం ఎదురొడ్డి నిలిచిందన్నారు మోదీ. బడ్జెట్‌పై బాగా చర్చ జరిగిందన్నారు. అద్భుతంగా చర్చించిన మహిళా సభ్యులను అభినందించారు.

16:12 February 10

మోదీ ప్రసంగం

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోదీ లోక్​సభలో మాట్లాడుతున్నారు.

13:42 February 10

'మేజర్​ పోర్ట్స్ అథారిటీ​ బిల్లు'కు పార్లమెంట్​ ఆమోదం

దేశంలోని 12 ప్రధాన నౌకాశ్రయాలకు నిర్ణయాధికారంలో స్వయం ప్రతిపత్తి కల్పించే 'మేజర్​ పోర్ట్స్​ అథారిటీ బిల్లు-2020'కు పార్లమెంట్​ ఆమోదం తెలిపింది. రాజ్యసభలో సుదీర్ఘ చర్చ అనంతరం బ్యాలెట్​ ఓటింగ్​ నిర్వహించగా.. 84 మంది అనుకూలంగా ఓటు వేశారు. 44 మంది వ్యతిరేకించారు.

11:03 February 10

రాజ్యసభ ముందుకు మేజర్​ పోర్ట్స్​ బిల్​

మేజర్​ పోర్ట్స్​ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు కేంద్ర మంత్రి మన్సుఖ్​ మాండవియా. బిల్లుపై చర్చ అనంతరం సాధారణ బడ్జెట్​పై చర్చించనున్నారు.  

10:52 February 10

'పెట్రోల్​ ధరలు ఎల్లప్పుడూ గరిష్ఠంగా ఉండవు'

అంతర్జాతీయ ముడి చమురు ధరపై ఆధారపడి భారత్​లో పెట్రోల్​ ధరలు ఉంటాయన్నారు పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​. ప్రస్తుతం ముడి చమురు బ్యారెల్​కు రూ.61గా ఉన్నట్లు చెప్పారు. ఇటీవల ఏడు రోజుల పాటు చమురు ధరలు కనిష్ఠంగా ఉన్నాయన్నారు. 250 రోజుల పాటు ధరలు స్థిరంగా ఉన్నయాని.. ప్రతిసారి గరిష్ఠంగా ఉండవని తెలిపారు.  కాంగ్రెస్​ నేత కేసీ వేణుగోపాల్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ మేరకు వెల్లడించారు. 

09:53 February 10

'వైరస్​ తీవ్రతను బట్టి విమాన సేవల పునరుద్ధరణ'

దేశంలో విమాన సేవలను 80 శాతానికి మించి అందుబాటులోకి తేవటం కరోనా వైరస్​ తీరుపై ఆధారపడి ఉందన్నారు పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్​ సింగ్​ పూరీ. కొన్ని విమాన సంస్థలు 100 శాతం పునరుద్ధరించాలని కోరుతుంటే.. మరి కొన్ని నెమ్మదిగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నట్లు చెప్పారు. విమాన సేవలు 80 శాతంలోపే ఎందుకు కొనసాగుతున్నాయని ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చారు. 

09:08 February 10

పార్లమెంట్​ లైవ్​: 'బడ్జెట్​పై చర్చ సమయాన్ని మరో 2 గంటలు పొడిగించాలి'

వార్షిక బడ్జెట్​పై చర్చించాలని సభ్యుల్లో చాలా ఆసక్తి ఉందన్నారు కాంగ్రెస్​ ఎంపీ జైరాం రమేశ్​. బడ్జెట్​పై చర్చ నిడివిని 10 గంటల నుంచి 12 గంటలకు పెంచాలని సూచించారు.  

రాజ్యసభ ముందుకు మేజర్​ పోర్ట్స్​ బిల్​ తీసుకొచ్చిన తర్వాత సాధారణ బడ్జెట్​పై చర్చ కొనసాగనుంది. లోక్​సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం తర్వాత చర్చించనున్నారు. 

ఆరోసారి.. 

సాధారణంగా వార్షిక బడ్జెట్​ను తొలుతు లోక్​సభలో చర్చిస్తారు. కానీ, 1955,1959,1963,1965, 2002లో మాత్రమే మొదట రాజ్యసభలో చర్చ చేపట్టారు. అదే విధంగా ఈసారి తొలుత రాజ్యసభలోనే బడ్జెట్​పై చర్చ జరగనుంది.  

ఉత్తరాఖండ్​ తరహా హిమనీనదాల విపత్తులపై పరిశోధన, నిరోధించే అంశాలపై చర్చించాలని కోరుతూ రాజ్యభలో శూన్యగంట నోటీసులు ఇచ్చారు భాజపా ఎంపీ అనిల్​ బలుని. పశ్చిమ ఉత్తర్​ప్రదేశ్​లో అలహాబాద్​ హైకోర్టు ప్రత్యేక బెంచ్​ ఏర్పాటు కోరుతూ.. శూన్య గంట నోటీసులు ఇచ్చారు భాజపా ఎంపీ విజయ్​ పాల్​ సింగ్​ తోమర్​. 

Last Updated : Feb 10, 2021, 7:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.