ETV Bharat / bharat

'నకిలీ ఓట్లకు చెక్​ పెట్టేందుకే ఆధార్​-ఓటర్​ కార్డ్ లింక్​'

నకిలీ ఓటరు కార్డులను తొలగించేందుకు ఆధార్​తో అనుసంధానం చేయాలనే ఎన్నికల సంఘం ​చేసిన ప్రతిపాదనకు పార్లమెంటరీ కమిటీ మద్దుతు తెలిపింది. ఆధార్​ సంఖ్యను ఓటరు గుర్తింపు కార్డుతో లంకె చేసే విధంగా ఎన్నికల చట్టంలో సవరణలు చేయాలని సూచించింది.

author img

By

Published : Mar 7, 2020, 6:24 AM IST

Par panel pitches for linking Aadhaar with electoral roll to weed out duplicate entries
నకిలీ ఓటరు కార్డులను తొలగించేందుకు ఆధార్​ మందు

నకిలీ ఓటరు గుర్తింపు కార్డులను నిరోధించేందుకు ఆధార్​తో అనుసంధానించాలనే ఎన్నికల సంఘం​(ఈసీ) ప్రతిపాదనకు పార్లమెంటరీ కమిటీ శుక్రవారం మద్దుతు తెలిపింది. ఓటరు గుర్తింపు కార్డుతో ఆధార్​ను అనుసంధానం చేసేందుకు ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నట్లు స్థాయి సంఘం పేర్కొంది

ఓటరు జాబితాను ప్రక్షాళన చేసేందుకు ఆధార్​ అనుసంధానం చేయాలని ఈసీ ప్రతిపాదన చేసింది. ఈ నేపథ్యంలోనే కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు, ఇప్పటికే ఓటర్ల జాబితాలో ఉన్నవారి నుంచి కూడా ఆధార్​ అనుసంధానించేలా ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని నిబంధనలను సవరించాలని గతేడాది ఆగస్టులోనే పోల్​ ప్యానెల్​ను ప్రతిపాదించింది.

2015లోనే నకిలీ ఓటరు కార్డులను తొలగించేందుకు ఆధార్​ అనుసంధానం చేయాలని ఆదేశాలు జారీ చేసింది సుప్రీం కోర్టు. ఓటరు జాబితాలో ఎటువంటి తప్పులు దొర్లకుండా చేయడమే దీని ముఖ్య ఉద్దేశం.

ఇదీ చూడండి: మోదీ సర్కారుకు మన్మోహన్​ మూడు సూత్రాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.