ETV Bharat / bharat

'ముందు ఎన్​పీఆర్​పై ప్రజల భయాలను పోగొట్టండి'

జాతీయ జనాభా పట్టిక (ఎన్​పీఆర్​)పై ప్రజల్లో ఉన్న తీవ్ర అసంతృప్తి, భయాన్ని ప్రభుత్వం పొగొట్టాలని పార్లమెంటరీ ప్యానెల్​ అభిప్రాయపడింది. వచ్చే నెలలో ప్రారంభం కానున్న జనగణన, ఎన్​పీఆర్​పై దేశ ప్రజల సందేహాలను నివృత్తి చేయాలని కోరింది.

Par panel asks govt to have a national consensus on NPR
ముందు ఎన్​పీఆర్​పై ప్రజల భయాలను పోగొట్టండి
author img

By

Published : Mar 6, 2020, 6:08 AM IST

Updated : Mar 6, 2020, 8:59 AM IST

'ముందు ఎన్​పీఆర్​పై ప్రజల భయాలను పోగొట్టండి'

జాతీయ జనాభా పట్టిక (ఎన్​పీఆర్), జనగణనపై ప్రజల్లో అనేక సందేహాలు, అపోహలు ఉన్నాయని పార్లమెంటరీ ప్యానెల్​ తెలిపింది. వచ్చే నెలలో మొదలయ్యే ఈ రెండు ప్రక్రియలపై దేశ ప్రజలకు పూర్తి అవగాహన కల్పించి.. వారిని ఒప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొంది.

కాంగ్రెస్​ నేత ఆనంద్​శర్మ నేతృత్వంలోని పార్లమెంటరీ స్థాయి సంఘం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. 2020-21 ఎన్​పీఆర్​, జనగణన కోసం ఆధార్​ మెటాడేటాను తీసుకునే అవకాశాలను పరిశీలించాలని కోరింది. ఈ మేరకు రాజ్యసభకు ఇచ్చిన నివేదికలో కమిటీ పేర్కొంది.

"వచ్చే నెలలో మొదలయ్యే ఎన్​పీఆర్​ ప్రక్రియపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ పూర్తి ఆమోదం తెలపాలని మేము భావిస్తున్నాం. ఇందుకు జాతీయ ఆమోదం కావాలి. దేశవ్యాప్తంగా ప్రజలందరికీ దీనిపై అవగాహన ఉండాలి. అప్పుడే ఈ ప్రక్రియ సులభతరంగా జరగడానికి అవకాశం ఉంది.​" - పార్లమెంటరీ ప్యానెల్​ కమిటీ

2021 జనగణన, ఎన్​పీఆర్​ ప్రక్రియ ఏప్రిల్​ 1 నుంచి సెప్టెంబర్​ 30 వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో వీటిపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని కమిటీ అభిప్రాయపడింది. హోంమంత్రిత్వశాఖ ఎన్​పీఆర్​లో కొత్తగా చేర్చిన పరామితులు, ప్రశ్నలపై రాష్ట్రాలను సమర్థించారా లేదా అనే ప్రశ్నలను కమిటీ లేవనెత్తింది.

2021 జనగణనలో బయోమెట్రిక్​ గుర్తింపు తీసుకునే ప్రతిపాదన లేదని కమిటీ అడిగిన ఓ ప్రశ్నకు హోంమంత్రిత్వశాఖ సమాధానమిచ్చింది. అలానే చరిత్రలో తొలిసారి జనగణన డిజిటల్​ విధానంలో జరుగుతుందని పేర్కొంది.

Last Updated : Mar 6, 2020, 8:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.