తమిళ ప్రజలకు సీఎం పళనిస్వామి శుభవార్త చెప్పారు. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే ఉచితంగా దాన్ని పంపిణీ చేస్తామని తెలిపారు. అందుకు అయ్యే ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు.
అయితే ఇటీవల కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ మాట్లాడుతూ.. టీకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాలంటే మరో ఆరు నెలల సమయం పడుతుందని అన్నారు.
ఎన్నికలు సమీపిస్తుండడం వల్ల రాజకీయ పార్టీలు అన్నీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు టీకా మంత్రం జపిస్తున్నాయి. బిహార్ ఎన్నికలకు సంబంధించి భాజపా తన మేనిఫెస్టోలో బిహార్ ప్రజలకు వ్యాక్సిన్ అందించడంమే తమ ప్రధానాంశమని స్పష్టం చేసింది.