సిక్కులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న కర్తార్‌పుర్ ఆధ్యాత్మిక నడవా రేపు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ముందుగా నిర్ణయించిన విధంగా కర్తార్‌పుర్ యాత్రికుల వద్ద సేవా రుసుముగా 20 డాలర్లు వసూలు చేయకూడదని నిర్ణయించింది పాకిస్థాన్. అయితే దీనిని ఈనెల 9 నుంచి 12 తేదిల మధ్య మాత్రమే వర్తింపజేస్తామని పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి వెల్లడించారు.
'ప్రేమకు నిదర్శనం ఈ నడవా..'
కర్తార్‌పుర్ ఆధ్యాత్మిక నడవా పంజాబ్ ప్రావిన్సులో వేర్పాటువాదాన్ని ప్రేరేపించేందుకు ఉపకరిస్తుందన్న వార్తలరై స్పందించారు ఖురేషి. ఇది ప్రేమకు నిదర్శనమని.. నడవా కారణంగా ఎలాంటి అపకారం జరగదని తెలిపారు.
ఆధ్యాత్మిక నడవా ప్రారంభోత్సవం చారిత్రకమైనదని తనను కలిసిన భారత జర్నలిస్టులతో అభిప్రాయపడ్డారు ఖురేషి.
ఇదీ చూడండి: రేపే రామజన్మభూమి తీర్పు-నిఘా నీడన అయోధ్య