ETV Bharat / bharat

మరోసారి పాక్​ దుర్నీతి- సరిహద్దు వెంబడి కాల్పులు

author img

By

Published : Aug 9, 2020, 11:01 AM IST

పాకిస్థాన్​ సైన్యం సరిహద్దులో మరోసారి వక్రబుద్ధిని ప్రదర్శించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ.. పూంఛ్​ జిల్లాలో సరిహద్దు వెంబడి కాల్పులకు తెగబడింది. ఈ దుశ్చర్యను సమర్థంగా తిప్పికొట్టాయి భారత బలగాలు.

Pakistan violates ceasefire along LoC in Poonch
సరిహద్దులో మరోసారి దుర్నితీని ప్రదర్శించిన పాక్​

సరిహద్దు వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదేపదే ఉల్లంఘిస్తోంది పాక్​. ఈరోజు ఉదయం జమ్ముకశ్మీర్​ పూంఛ్​​ జిల్లాలో సరిహద్దు వెంబడి కాల్పులకు తెగబడింది పాక్​ సైన్యం. మాన్​కోట్​ సెక్టార్​లోని నియంత్రణ రేఖ వెంబడి మోర్టార్లను ప్రయోగించినట్లు అధికారులు తెలిపారు. పాక్​ సైన్యం కాల్పులకు దీటుగా స్పందించింది భారత సైన్యం.

ఈ ఏడాదిలో పాక్ మొత్తం 2,720 సార్లు కాల్పుల విరమణను అతిక్రమించింది. ఈ ఘటనల్లో మొత్తం 21 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మరో 94 మంది గాయపడ్డారు.

ఇదీ చదవండి: 'ఆ ప్రాంతం నుంచి చైనా వెనక్కి మళ్లాల్సిందే!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.