పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్ రాజౌరీ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి గ్రామాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది.
పాక్ చర్యను భారతసైన్యం దీటుగా తిప్పికొట్టినట్లు అధికారులు తెలిపారు. సుందర్బనీ సెక్టార్లో భారత్, పాక్ సైన్యాల మధ్య భీకర కాల్పులు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్పష్టం చేశారు.