ETV Bharat / bharat

సరిహద్దులో ఆగని పాక్​ దుశ్చర్య

సరిహద్దులో పాకిస్థాన్​ మరోసారి తన దుర్నీతిని బయటపెట్టింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ.. భారత్​పై ఆయుధాలు విసిరి దాడికి పాల్పడింది. అయితే.. ఈ దాడులకు దీటుగా బదులిచ్చింది భారత సైన్యం. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

Pak violates ceasefire in J-K's Poonch district
సరిహద్దులో ఆగని పాక్​ దుశ్చర్య
author img

By

Published : Dec 5, 2020, 8:59 PM IST

పాకిస్థాన్​ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్​ పుంఛ్​​, కథువా జిల్లాల్లోని గ్రామాలు సహా.. నియంత్రణ రేఖ వెంబడి ఆయుధాలు, మోర్టార్​ షెల్స్​తో దాడులకు పాల్పడిందని అధికారులు తెలిపారు. పాక్​ చర్యలను భారత సైన్యం దీటుగా ఎదుర్కొందని వారు చెప్పారు. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదన్నారు.

తొలుత శనివారం ఉదయం 11:40 గంటల ప్రాంతంలో బాలాకోట్​ సెక్టార్​లోని నియంత్రణ రేఖ వెంబడి.. దాయాది సైన్యం కాల్పులకు తెగబడినట్టు వెల్లడించారు అధికారులు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కస్బా, కిర్నీ సెక్టార్​ ప్రాంతాలపై దాడులు చేసిందన్నారు. కథువా జిల్లా హీరానగర్​ సెక్టార్​లోని జాతీయ సరిహద్దు వెంబడి గ్రామాలు, ఫార్వర్డ్​ పోస్టులే లక్ష్యంగా దాడులకు పాల్పడినట్టు సమాచారం.

అంతకుముందు.. శుక్రవారం కూడా భారత్​పై దాడి చేశాయి పాక్​ బలగాలు. కేరన్​ సెక్టార్​లోని నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు జరిపాయి..

ఇదీ చదవండి: 'భారత్​ బంద్​'కు కార్మిక సంఘాల​ మద్దతు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.