ETV Bharat / bharat

కశ్మీర్ ఎఫెక్ట్: సంఝౌతాపై రగడ-భిన్న ప్రకటనలు - సంఝౌతా

సంఝౌతా ఎక్స్​ప్రెస్​ రైలు రద్దు అంశంపై భారత్-పాక్ భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. భద్రతా కారణాలతో రైలు సేవలు నిలిపేస్తున్నామని పాకిస్థాన్ ప్రకటించింది. అయితే భారత్​ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించింది. రైలు సేవలు నిలిచిపోలేదని భారత్ ప్రకటించింది.

కశ్మీర్ ఎఫెక్ట్: సంఝౌతాపై రగడ-భిన్న ప్రకటనలు
author img

By

Published : Aug 8, 2019, 6:49 PM IST

పాకిస్థాన్ నుంచి భారత్​కు బయలుదేరిన సంఝౌతా ఎక్స్​ప్రెస్ వాఘా సరిహద్దు వద్ద నిలిపివేయగా భారత రైల్వే సిబ్బంది అత్తారీ నుంచి ఇంజిన్​తో వెళ్లి తీసుకొచ్చారు. అంతకుముందు భద్రతా కారణాలతో సంఝౌతా సేవలను నిలిపివేస్తున్నామని దాయాది పాక్ ప్రకటించింది.

ఈ రైల్లో పాక్​ నుంచి 110 మంది ప్రయాణికులు భారత్​కు వచ్చారు. అంతకుముందు సంఝౌతా ఎక్స్​ప్రెస్ సేవలను నిలిపివేస్తున్నామని పాకిస్థాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ ప్రకటించారు. కానీ భారత అధికారులు మాత్రం ఇందుకు భిన్నమైన ప్రకటన చేశారు. సంఝౌతా పరుగులు ఆగవని వెల్లడించారు.

"సంఝౌతా రైలు సేవలు ఆగిపోలేదు. నడుస్తుంది. సంఝౌతా ఎక్స్​ప్రెస్​ సిబ్బంది భద్రతకు సంబంధించిన అంశాలను పాక్ అధికారులు లేవనెత్తుతున్నారు. భారత వైపు నుంచి పరిస్థితి అదుపులోనే ఉందని వెల్లడించాం. మన ఇంజిన్ మన సిబ్బందితో అత్తారీ వరకు ప్రయాణిస్తుంది."

-దీపక్ కుమార్, ఉత్తర రైల్వే అధికార ప్రతినిధి

ప్రస్తుతం సంఝౌతా ఎక్స్​ప్రెస్ ద్వారా 70మంది ప్రయాణికులు భారత్​ నుంచి పాకిస్థాన్​ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని దీపక్ కుమార్ స్పష్టం చేశారు.

సంఝౌతా చరిత్ర...

సంఝౌతా అనే పదానికి ఒప్పందం అని అర్థం. 1976 జులై 22న ప్రారంభమైన ఈ రైలులో ఆరు స్లీపర్ క్లాస్​ బోగీలు, ఒక బోగి ఉంటుంది. 1971 యుద్ధం అనంతరం ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంతో ఈ రైలు ప్రారంభమైంది.

ఇదీ చూడండి: చిరునవ్వుల చిన్నమ్మకు వినూత్న నివాళి!

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.