కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు అనంతరం... భారత్‌పై పాక్ కుట్రలు పన్నుతూనే ఉంది. అంతర్జాతీయ సమాజం ముందు భారత్‌ను దోషిగా నిలబెడదామని విఫలయత్నాలు చేసింది. వీటితో ఫలితం లేకపోవడం వల్ల ఆగస్టు 27 నుంచి... దాదాపు 2 నెలలుగా భారత్‌కు తపాలా సేవలను నిలిపివేసింది దాయాది దేశం. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా.. ఇలా వ్యవహరించడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
పాక్ నిర్ణయం అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు కేంద్ర ప్రసార, సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్.
"అన్ని దేశాల తపాలా శాఖలు.... ప్రపంచ తపాలా సమాఖ్య విధానం కింద పనిచేస్తాయి. పాక్ చర్య దీనికి వ్యతిరేకంగా ఉంది. పాక్ నిర్ణయానికి తగ్గట్లుగానే భారత తపాలా శాఖ ప్రతిస్పందన ఉంటుంది." - రవిశంకర్ ప్రసాద్, కేంద్ర ప్రసార, సమాచార శాఖ మంత్రి