జమ్ముకశ్మీర్ సమస్య పరిష్కారమే తమకు విదేశీ వ్యవహారాల్లో ప్రధాన అజెండా అని పాకిస్థాన్ ప్రకటించింది. తమ దేశం భారత్‌తో ద్వైపాక్షిక చర్చలకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని పాక్ విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి మహమ్మద్ ఫైజల్ వెల్లడించారు.
కశ్మీర్ అంశమై ఐరాస మానవహక్కుల మండలిని పాక్ విదేశాంగ మంత్రి మహమూద్ ఖురేషీ కలవనున్నారని వెల్లడించారు ఫైజల్.
కశ్మీర్‌పై పోరాడాలి: ఇమ్రాన్
కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి తొలగింపు అంశమై పాకిస్థాన్ పౌరులు పోరాడాలని అంతకుముందు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ పిలుపునిచ్చారు.
"మనదేశం కశ్మీర్ ప్రజల వెనక స్థిరంగా నిలబడుతోందని అక్కడి ప్రజలకు సందేశమివ్వాలి."
-ఇమ్రాన్‌ఖాన్, పాకిస్థాన్ ప్రధానమంత్రి
ఇదీ చూడండి: కశ్మీర్ విభజన, అభివృద్ధిపై కేంద్రం ముమ్మర కసరత్తు