పాక్, చైనా కలిసి భారత్‌కు ముప్పుగా మారాయని, వాటిని తేలికగా తీసుకోలేమని అన్నారు భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణె. సైనిక దినోత్సవానికి(ఈ నెల 15న) ముందు నిర్వహించిన వార్షిక మీడియా సమావేశంలో ఈమేరకు చెప్పిన ఆయన... తూర్పు లద్దాఖ్ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
బలగాల ఉపసంహరణపై త్వరలోనే భారత్, చైనా మధ్య ఏకాభిప్రాయం కుదురుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు నరవాణె.
గతేడాంతా సవాళ్లే..
గత ఏడాదిలో సుదీర్ఘకాలం పాటు అనేక చర్చలు, ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నామన్నారు సైన్యాధిపతి. వాటిలో కొవిడ్-19, ఉత్తర భారత సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ప్రధానమైనవిగా చెప్పారు. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవడానికి.. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి విస్తృత రోడ్ మ్యాప్‌ను రూపొందించామని వివరించారు. అందుకు తగ్గట్టుగా సైన్యాన్నీ సన్నద్ధం చేస్తున్నట్టు చెప్పారు.
ఇదీ చదవండి: 'కుటుంబ రాజకీయాలకు కాలం చెల్లింది- యువత రావాలి'