దీనికి సంబంధించిన చిత్రాలను భారత సైన్యం విడుదల చేసింది. ఈ చిత్రాల్లో తలకిందులుగా ఎగరేసిన పాక్ జాతీయ పతాకం కనిపిస్తోంది. పతాకాన్ని సాధారణంగా విపత్కర పరిస్థితుల్లో సహాయార్థం తలకిందులుగా ఎగరేస్తారు.
కొనసాగుతున్న పాక్ ఉల్లంఘనలు
సరిహద్దు వెంబడి పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. జమ్ముకశ్మీర్ పూంచ్ సెక్టార్లోని నియంత్రణ రేఖ వెంబడి జరిపిన కాల్పుల్లో భారత జవాను ప్రాణాలు కోల్పోయాడు.