తమ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించాలని యత్నించిన భారత జలాంతర్గామిని అడ్డుకున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను విడుదల చేసింది. శాంతిని కోరుకుంటున్న దృష్ట్యా దాడి చేయలేదని పాక్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రాదేశిక జలాలను కాపాడుకోవటానికి తమ నావికా దళం సిద్ధంగా ఉందని పాక్ ఉద్ఘాటించింది. 2016 నవంబర్ తర్వాత భారత నౌకాదళం ఇలా చేయటం ఇది రెండోసారని వివరించారు పాక్ అధికారులు. ఇకనైనా భారత్ శాంతిపథంలో పయనించాలన్నారు.
పుల్వామా దాడి అనంతరం భారత వాయుసేన పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలపై దాడి చేసింది. మరుసటి రోజు పాక్ వాయుసేన భారత్‌లో వైమానికి దాడికి యత్నించింది. దీంతో ఇరుదేశాల సేనల మధ్య జరిగిన ఘర్షణలో మిగ్ 21 బైసన్ కూలిపోయింది. పైలట్ అభినందన్ పాక్‌కు చిక్కారు. భారత దౌత్య కృషి వల్ల శుక్రవారం వింగ్ కమాండర్ వర్థమాన్‌ను తిరిగి భారత్‌కు అప్పగించింది ఇస్లామాబాద్.