ETV Bharat / bharat

'ఆక్స్​ఫర్డ్ టీకాపై తొందరొద్దు- ఫలితం మారొచ్చు' - ఆక్స్​ఫర్డ్ టీకాపై శాస్త్రవేత్తల అభిప్రాయం

తక్కువ ధర, సులభతర రవాణా, నిల్వ వంటి అంశాలతో ఆక్స్​ఫర్డ్ టీకా భారత్​ సహా పలు దేశాలకు ఆశాకిరణంగా మారింది. తాజాగా వెల్లడైన ఫలితాలతో ఈ టీకాకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. అయితే ఈ ఫలితాలు మారిపోయే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడే పూర్తి విశ్లేషణకు రావడం కష్టమని తేల్చిచెబుతున్నారు.

Oxford COVID-19 results caution scientists
'ఆక్స్​ఫర్డ్ టీకాపై తొందరొద్దు- ఫలితం మారొచ్చు'
author img

By

Published : Nov 24, 2020, 7:36 PM IST

ఆక్స్​ఫర్డ్ వ్యాక్సిన్ 70 శాతం సమర్థంగా పనిచేస్తోందన్న ప్రకటనతో అందరి దృష్టీ ఈ టీకా పైనే పడింది. ధర తక్కువగా ఉండటం, సులభంగా నిల్వ చేసుకోగలిగే వెసులుబాటుతో భారత్ సహా పలు దేశాలకు ఆశాకిరణంగా నిలిచింది. మోడెర్నా, ఫైజర్, స్పుత్నిక్ వీ టీకాలతో పోలిస్తే ఆక్స్​ఫర్డ్​పైనే చాలా దేశాలు ఆశలు పెట్టుకున్నాయి. అయితే ఇవి ప్రాథమిక ఫలితాలు మాత్రమేనని, పూర్తి సమాచారం వెల్లడయ్యేందుకు మరింత సమయం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

"ఆక్స్​ఫర్డ్ టీకాను తొలి ప్రాధాన్యంగా భావిస్తే ఫర్వాలేదు. కానీ గణాంకాలు అస్థిరంగా ఉన్నాయి. ఇప్పుడే పూర్తి విశ్లేషణ చేయడం కష్టం."

-శాస్త్రవేత్తలు

ఆక్స్​ఫర్డ్ టీకా సమర్థంగా పనిచేస్తోందన్న ప్రకటన సంతోషం కలిగిస్తున్నప్పటికీ.. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వైరాలజిస్ట్ ఉపాసన రే పేర్కొన్నారు. కోల్​కతాలోని సీఎస్ఐఆర్-ఐఐసీబీలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు ఉపాసన. మధ్యంతర ఫలితాలు ఆశాజనకంగానే ఉన్నాయని, అయితే పూర్తి స్థాయిలో సమీక్షించిన నివేదిక లేనిదే టీకాపై సమగ్ర విశ్లేషణ చేపట్టడం కష్టమని అభిప్రాయపడ్డారు.

"టీకాపై కొన్ని విషయాల్లో అంతరాలు ఉన్నాయి. తక్కువ డోసు ఇచ్చినప్పుడు అధిక సమర్థత ఎందుకు వచ్చిందనే విషయం తెలియాలి. ప్రతికూల ఉష్ణోగ్రత బారిన పడకుండా ఎంత కాలం పాటు రిఫ్రిజిరేటర్లో టీకాను నిల్వ చేయవచ్చో స్పష్టత రావాలి. ట్రయల్స్ పూర్తి ఫలితాలు వచ్చే సరికి గణాంకాలు మారిపోవచ్చు."

-ఉపాసన రే, వైరాలజిస్ట్- కోల్​కతా సీఎస్ఐఆర్

అయితే ఇతర వ్యాక్సిన్లతో పోలిస్తే ఆక్స్​ఫర్డ్ టీకానే ఉత్తమమైనదని అభిప్రాయం వ్యక్తం చేశారు ఉపాసన . ఆక్స్​ఫర్డ్ టీకాను రిఫ్రిజిరేటర్లలోనే నిల్వ చేసుకోగలిగే అవకాశం ఉండటం ప్రయోజనకరమని అన్నారు. మూడో దశ ట్రయల్స్​లో ముందున్న ఇతర టీకాలు.. మైనస్ ఉష్ణోగ్రతలలోనే నిల్వ ఉంచాలని గుర్తు చేశారు. కాబట్టి ఆక్స్​ఫర్డ్ టీకా విషయంలో కోల్డ్ చైన్ సరఫరా సమస్య కొంత వరకు తగ్గినట్లేనని చెప్పారు. అయితే దీర్ఘకాలం పాటు నిల్వ చేయాల్సి వస్తే ఇందులోనూ ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. తక్కువ డోసు ఉన్న టీకా సమర్థంగా పనిచేస్తే ఖర్చు విషయంలోనూ కలిసొస్తుందని చెప్పారు. దేశీయంగా అభివృద్ధి చేస్తున్న కొవ్యాగ్జిన్, జైకోవ్​-డీ టీకా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

మోడెర్నా, ఫైజర్​ సత్తా చాటినా..

ఆక్స్​ఫర్డ్​తో పోలిస్తే ఫైజర్, మోడెర్నా, స్పుత్నిక్ వీ టీకాలు ఉత్తమ పనితీరు కనబర్చాయి. ఫేజ్​ 3 ట్రయల్స్​ మధ్యంతర ఫలితాల్లో మోడెర్నా 94.5 శాతం, ఫైజర్ 90 శాతం, స్పుత్నిక్ వీ 92 శాతం సమర్థత చాటుకున్నాయి. మోడెర్నా, ఫైజర్ టీకాలు ఎంఆర్​ఎన్​ఏ ఆధారిత సాంకేతికతతో అభివృద్ధి చేశారు. వీటిని నిల్వ చేసేందుకు అతి శీతల వాతావరణం అవసరం. ఫైజర్ టీకా నిల్వ చేసేందుకు మైనస్ 70 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కావాల్సి ఉంటుంది. స్పుత్నిక్ వీ టీకాను మైనస్ 20 డిగ్రీల వద్ద నిల్వ చేయాలి.

ఈ నేపథ్యంలో ఎంఆర్​ఎన్​ఏ టీకాలతో పోలిస్తే ఇతర వ్యాక్సిన్ క్యాండిడేట్లే భారత్​ వంటి ప్రాంతాలకు ప్రయోజనకరమని ఇమ్యునాలజిస్ట్ సత్యజిత్ రథ్​ పేర్కొన్నారు. అయితే ఆక్స్​ఫర్డ్ టీకా ఫలితాలు మారిపోయే అవకాశం ఉందని.. ఇప్పుడే దాని గురించి ఎక్కువగా ఆలోచించడం మంచిది కాదని స్పష్టం చేశారు.

"రెండు వేర్వేరు డోసుల విధానాలలో భిన్న ఫలితాలు రావడాన్ని మనం గమనించాలి. వ్యాక్సిన్ క్యాండిడేట్ నిర్మాణం ఎలా ఉన్నప్పటికీ.. చాలా టీకాలు స్వల్ప కాలంలో చాలా సమర్థంగానే పనిచేస్తాయి. ఈ గణాంకాలు సహేతుకంగా ఉన్నప్పటికీ.. ఇవన్నీ ప్రాథమిక వివరాలే. వాస్తవ సంఖ్య విషయంలో అస్థిరత నెలకొంది. ఈ ఫలితాల్లో ఎన్నో మార్పులు ఉండే అవకాశం ఉంది."

-సత్యజిత్ రథ్​, ఇమ్యునాలజిస్ట్

ఆక్స్​ఫర్డ్ టీకా తుది ఫలితాలు గణనీయంగా మారిపోయే అవకాశం ఉందని యూకేలోని లీసెస్టర్ యూనివర్సిటీ శాస్త్రవేత్త జులియన్ తాంగ్ పేర్కొన్నారు. ఫైజర్, మోడెర్నా టీకాలు వివిధ ప్రాంతాల్లోని మానవ జాతులపై అధ్యయనం చేసి సమర్థత నిరూపించుకున్నాయని అన్నారు. ప్రాథమిక ట్రయల్స్​లో ఆక్స్​ఫర్డ్ టీకాను మాత్రం శ్వేతజాతీయులపైనే ఎక్కువగా ప్రయోగించారని చెప్పారు.

రెండు వ్యాక్సిన్ క్యాండిడేట్ల సమర్థతను పోల్చి చూడటం ఆసక్తికరంగా ఉందని బర్మింగ్​హమ్ యూనివర్సిటీ వైరాలజిస్ట్ జానియా స్టామటాకీ పేర్కొన్నారు. అయితే ప్రాథమిక ఫలితాలన్నీ నియంత్రణ సంస్థల నుంచి ఆమోదం పొందడానికేనని స్పష్టం చేశారు. ఈ ఫలితాలు తర్వాత మారిపోతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

కరోనా టీకా పంపిణీకి సిద్దమవ్వండి: మోదీ

కరోనా టీకా వేసేందుకు సిరంజీలు సిద్ధమా?

'టీకా సైడ్​ ఎఫెక్ట్స్'​పై కేంద్రం కీలక సూచనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.