ETV Bharat / bharat

బంగాల్ బరిలో ఎంఐఎం- పొత్తుల కోసం పర్యటన - Owaisi visits Bengal news updates

బంగాల్​ శాసనసభ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేయనుంది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత రాష్ట్రంలోని ముస్లిం మత పెద్దలతో సమావేశమయ్యారు.

Owaisi visits Bengal, holds meeting with religious leader
బంగాల్ బరిలో ఎంఐఎం-పొత్తుల కోసం పర్యటన
author img

By

Published : Jan 3, 2021, 2:50 PM IST

బిహార్​ ఎన్నికల్లో అనుకున్న దానికంటే మెరుగైన ఫలితాలు సాధించిన ఎంఐఎం పార్టీ.. వచ్చే బంగాల్​ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని చూస్తోంది. శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ పార్టీ అధినేత అసదుద్దీన్​ ఓవైసీ.. పశ్చిమ్​ బంగాలోని ముస్లిం మతపెద్దలతో వరుసగా భేటీ అవుతున్నారు. భవిష్యత్​ ప్రణాళికలు, కలిసి పోటీ చేసే విషయంపై అక్కడి ముస్లిం నాయకుడు అబ్బాస్ సిద్దిఖీతో చర్చలు జరిపినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కొంతకాలంగా సిద్దిఖీ.. దీదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీరి కలయిక ప్రాధాన్యం సంతరించుకుంది.

బంగాల్​ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ ప్రకటించిన తర్వాత ఓవైసీ మొదటిసారిగా.. రాష్ట్రంలో పర్యటించారు. ఓవైసీ రాకను అధికార తృణమూల్​ అడ్డుకుంటుందని ఆ పార్టీ నేతలు భావించారు. అందుకే ఈ సమావేశాన్ని రహస్యంగా ఉంచాలకున్నట్లు బంగాల్​ ఎంఐఎం కార్యదర్శి జమీరుల్ హసన్ తెలిపారు.

ముస్లింలు అంతా మా వెంటే..

ఎంఐఎం అధినేత బంగాల్​ పర్యటనపై అధికార పార్టీ నేతలు స్పందించారు. ఓవైసీ భాజపా చెప్పినట్లు నడుచుకుంటున్నారని ఆరోపించారు తృణమూల్​ ఎంపీ సౌగతా రాయ్. బెంగాలీ మాట్లాడే ముస్లింలు మమత ప్రభుత్వానికే మద్దతుగా నిలుస్తారని తెలిపారు. ఈ విషయం తెలిసి ఓవైసీ.. సిద్దిఖీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో దాదాపు 100-110 సీట్లలో ముస్లింలు నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. వారే తమ పార్టీకి బలమని రాయ్​ అన్నారు.

ఇదీ చూడండి: ఉగ్ర అనుచరుడు అరెస్టు- ఆయుధాలు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.