సరిహద్దుల్లో భద్రతా ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేస్తోంది ప్రభుత్వం. నియంత్రణ రేఖ, జమ్ము అంతర్జాతీయ సరిహద్దుల్లో 8,600 బంకర్ల నిర్మాణం పూర్తి చేసింది. సరిహద్దుల్లోని మొత్తం 5 జిల్లాల్లో ఈ నిర్మాణాలను చేపట్టింది.
పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి అత్యధికంగా 4,431 బంకర్లను నిర్మాణం చేపట్టింది ప్రభుత్వం. రాజౌరీ జిల్లాలో 1,238 బంకర్లను ఏర్పాటు చేసింది. సాంబా, కథువా, జమ్ములో సుమారు వెయ్యి బంకర్లను నిర్మించింది.
కాల్పుల నుంచి రక్షణగా...
సరిహద్దుల్లో పాక్ తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. ఫలితంగా స్థానికుల రక్షణార్థం బంకర్లను నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. 2017 డిసెంబర్లో 14,460 బంకర్ల నిర్మాణానికి రూ.415 కోట్లను విడుదల చేసింది కేంద్రం.
ఇదీ చూడండి: జాతీయ యుద్ధ స్మారకంపై స్క్వాడ్రన్ లీడర్ రవిఖన్నా పేరు